News February 8, 2025
శ్రీశైలంలో మద్యం తాగుతూ పట్టుబడిన వైసీపీ నేత!

శ్రీశైలం దేవస్థానం పరిధిలో వైసీపీ నేత మద్యం తాగుతూ పట్టుబడ్డారు. దేవస్థానం నిబంధనలు అతిక్రమించి ఆలయ ఉద్యోగితో కలిసి రజాక్ అనే వ్యక్తి మద్యం తాగుతున్నారు. రాత్రి పోలీసులు దాడులు నిర్వహించగా రెడ్ హ్యండెడ్‌గా పట్టుబడ్డారు. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేవదాయ చట్టం ఉల్లంఘన మేరకు వారిపై కేసు నమోదు చేస్తున్నట్లు సమాచారం. రజాక్ అనే వ్యక్తి మాజీ ఎమ్మెల్యేకు ముఖ్య అనుచరుడిగా తెలుస్తోంది.
Similar News
News April 11, 2026
ADB: కొత్త ‘మీసేవ’లకు దరఖాస్తుల ఆహ్వానం

ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పౌర సేవలను విస్తరించేందుకు ప్రభుత్వం కొత్త మీసేవ కేంద్రాల ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. కలెక్టర్ నేతృత్వంలోని కమిటీ ఈ దరఖాస్తులను పరిశీలించి అర్హులకు ఫ్రాంచైజీలు కేటాయించనుంది. ప్రజలకు ప్రభుత్వ సేవలను మరింత చేరువ చేయడమే ఈ నిర్ణయం ప్రధాన ఉద్దేశం.
News April 11, 2026
సిద్దిపేట: ’18 మందికి రూ.1,83,500 జరిమానా’

సిద్దిపేటలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన 18 మందిని పట్టుకున్నారు. వారిని కోర్టులో హాజరుపరచగా స్పెషల్ సెకండ్ క్లాస్ జుడీషియల్ మెజిస్ట్రేట్ రూ.1,83,500 జరిమానా విధించారు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపిన ముగ్గురికి రూ.15వేలు జరిమానా విధించారు. డ్రంకెన్ డ్రైవ్ ప్రమాదకరమని, నియమాలు పాటించాలని ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ సూచించారు.
News April 11, 2026
ద్వారకాతిరుమల: 26 నుంచి శ్రీవారి వైశాఖమాస కళ్యాణోత్సవాలు

ద్వారకాతిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి వారి వైశాఖమాస తిరు కళ్యాణోత్సవాలను ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు ఈవో భద్రాజీ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఉత్సవాలలో భాగంగా శ్రీవారి కళ్యాణోత్సవం ఏప్రిల్ 30 గురువారం రాత్రి 8 గంటలకు, రథోత్సవం మే 1 శుక్రవారం రాత్రి 7:30 గంటలకు నిర్వహిస్తామన్నారు. ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు అన్ని సేవలను తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నామన్నారు.


