News February 7, 2025
శ్రీశైలంలో మహా శివరాత్రి ఏర్పాట్ల పరిశీలన

శ్రీశైలంలో ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న మహాశివరాత్రి ఏర్పాట్లను ఈవో శ్రీనివాసరావు గురువారం పరిశీలించారు. రక్షిత మంచినీటి సరఫరా, నిర్మాణంలో ఉన్న మినీ కల్యాణకట్ట, పలు పార్కింగ్ ప్రదేశాలు, గణేశ సదన్ ఎదురుగా ఉన్న సెంట్రల్ పార్కింగ్, సీఆర్ఓ వద్ద పార్కింగ్ ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు.
Similar News
News February 10, 2026
టీనేజ్ ప్రెగ్నెన్సీలో ‘రెడ్ జోన్’లో అనంతపురం

అనంతపురం జిల్లాలో టీనేజ్ ప్రెగ్నెన్సీ శాతం 12కుపైగా నమోదు కావడంపై సీఎం చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం అధికారులతో నిర్వహించిన సమీక్షలో సీఎం మాట్లాడుతూ.. ఈ విషయంలో జిల్లా రెడ్ జోన్‌లో ఉన్నట్లు స్పష్టమైందని పేర్కొన్నారు. గత ఏడాది జిల్లాలో 1,500 మందికి పైగా టీనేజర్లు గర్భం దాల్చినట్లు గణాంకాలు చెబుతున్నాయి. దీనిపై అవగాహన పెంచి, బాల్య వివాహాలను అరికట్టాలని సీఎం ఆదేశించారు.
News February 10, 2026
సూర్య అద్భుతమైన కెప్టెన్: గంభీర్

భారత T20 కెప్టెన్ సూర్యకుమార్‌పై కోచ్ గంభీర్ ప్రశంసలు కురిపించారు. ‘అతడు అద్భుతమైన నాయకుడు. బ్యాటర్‌గా ఓ వైపు అదరగొడుతూనే తోటి ఆటగాళ్లతో మంచి సంబంధాలను పెంచుకున్నాడు. జట్టు వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతున్నాడు. దీంతో కోచ్‌గా నాకు ఈజీ అవుతోంది. అలాంటి వ్యక్తి టీమ్ ఇండియాను నడిపించడం గొప్ప విషయం. సూర్య ఒత్తిడిలోనూ సరైన నిర్ణయాలు తీసుకుంటాడు’ అని కొనియాడారు. USAతో మ్యాచ్‌లో సూర్య చెలరేగడం తెలిసిందే.
News February 10, 2026
VZM: పాము కాటుతో వ్యక్తి మృతి

సంతకవిటి మండలం సిరిపురం పంచాయతీ యాగాటిపేటకి చెందిన రైతు సిరి ఆనందరావు (50) పాము కాటుకు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. ఆనందరావు సోమవారం తన పొలంలో మినప చేనును ఇంటికి తీసుకువస్తుండగా దారిలో పాము కాటేసింది. విషయాన్ని కుటుంబ సభ్యులకు ఫోన్లో తెలియజేయగా వారు 108కు సమాచారం ఇవ్వడంతో పొందూరు ప్రభుత్వ ఆసుపత్రి లో చేర్చారు. మార్గమధ్యలోనే ఆయన మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.


