News April 14, 2025
శ్రీశైలంలో రద్దీ.. ఆ దర్శనాలు రద్దు

శ్రీశైలం మల్లన్న సన్నిధిలో రెండు రోజులుగా భక్తుల రద్దీ పెరిగింది. దీంతో ప్రత్యేక దర్శనాలను రద్దు చేస్తున్నట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు ఓ ప్రకటనలో వెల్లడించారు. ఉభయ తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక మహారాష్ట్ర తమిళనాడు నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివస్తుండటంతో సోమవారం అర్జిత సేవలు రద్దు చేసినట్లు వెల్లడించారు. భక్తులు సహకరించాలని కోరారు.
Similar News
News November 5, 2025
జేఎన్టీయూ-ఏ ఫార్మాడీ ఫలితాలు విడుదల

అనంతపురం జేఎన్టీయూ పరిధిలో సెప్టెంబర్లో నిర్వహించిన ఫార్మాడీ 3వ సంవత్సరం రెగ్యులర్, సప్లిమెంటరీ (ఆర్17), ప్రీ-పీహెచ్డీ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివకుమార్ ఫలితాలను రిలీజ్ చేశారు. ఫలితాల కోసం jntuaresults.ac.in వెబ్సైట్ను సందర్శించాలని అధికారులు సూచించారు.
News November 5, 2025
10ఏళ్లలో 10 మంది కబడ్డీ ప్లేయర్ల హత్య

పంజాబ్లో కబడ్డీ ప్లేయర్ గుర్వీందర్ సింగ్ను లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ కాల్చి చంపింది. శత్రువులందరికీ ఇదే తమ హెచ్చరిక అని SMలో పోస్టు చేసింది. ‘మీ దారులు మార్చుకోండి లేదా గుండెలో బుల్లెట్ దించుకోవడానికి రెడీగా ఉండండి’ అని పేర్కొంది. నిందితుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు 2016 నుంచి డ్రగ్స్, గ్యాంగ్స్టర్స్, క్రైమ్తో సంబంధమున్న 10 మంది కబడ్డీ ప్లేయర్లు హత్యకు గురికావడం గమనార్హం.
News November 5, 2025
IIM షిల్లాంగ్లో ఉద్యోగాలు

<


