News February 25, 2025
శ్రీశైలంలో శివరాత్రి భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన డీఐజీ

శ్రీశైలంలో జరుగుతున్న శివరాత్రి భద్రతా ఏర్పాట్లను కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ పరిశీలించారు. నంద్యాల ఇన్ఛార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్తో కలిసి క్షేత్ర పరిధిలో పర్యటించారు. దేవస్థానం వద్ద ఏర్పాటు చేసిన క్యూలైన్లు, ఆలయ పరిసరాలను పరిశీలించారు. సీసీ టీవీల కంట్రోల్ రూమ్ను పరిశీలించారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.
Similar News
News February 26, 2025
వరంగల్: ఇంట్లో పేలుడు.. ఉలిక్కిపడ్డ ప్రజలు

వరంగల్ కొత్తవాడలో తాళం వేసిన ఇంట్లో పేలుడు సంభవించింది. ఒక్కసారిగా పేలడంతో అక్కడే నివసిస్తున్న ప్రజలందరూ ఉలిక్కి పడ్డారు. తాళం వేసిన ఇంట్లో అనుమానాస్పద పదార్థాలు పేలినట్లు చర్చించుకుంటున్నారు. ఆందోళనకు గురైన కాలనీవాసులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక మట్టేవాడ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
News February 26, 2025
MNCL: రైతుల ఖాతాల్లో పీఎం కిసాన్ నగదు జమ

మంచిర్యాల జిల్లాలోని రైతుల ఖాతాల్లో 19వ విడత పీఎం కిసాన్ పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ.2 వేలు నగదు జమ చేసింది. జిల్లాలోని అర్హులైన రైతులకు ప్రతి ఏడాది మూడు విడతల్లో రూ.2 వేల చొప్పున రూ.6 వేలు జమ చేస్తోంది. ఇప్పటి వరకు 17వ విడతలో 55,658 మంది రైతులకు, 18వ విడతలో 40,534 మంది ఖాతాల్లో నగదు జమ కాగా.. ఈ విడతలో 56 వేల మంది వరకు రైతుల ఖాతాల్లో జమ కానుంది.
News February 26, 2025
నేడు ఓర్వకల్లుకు ప్రముఖ లేడీ సింగర్ రాక

ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గలోని శ్రీ భ్రమరాంబ సమేత బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో బుధవారం శివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత ఆధ్వర్యంలో నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ బ్రహ్మోత్సవాల్లో ప్రముఖ సింగర్ మధుప్రియ, పల్సర్ బైక్ ఝాన్సీ, రమేశ్ బృందం సందడి చేయనుంది. ఈ మేరకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.