News June 24, 2024
శ్రీశైలంలో సన్నిధిలో డీప్యూటీ సీఎంతో పాలమూరు ఎమ్మెల్యేలు
శ్రీశైలం మల్లికార్జున స్వామిని తెలంగాణ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కుటుంబ సభ్యులతో సోమవారం దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు వారికి సాదరంగా ఆహ్వానం పలికి ప్రత్యేక పూజలు చేయించి, వేద ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. వారి వెంట మంత్రి జూపల్లి కృష్ణారావు, ఉమ్మడి పాలమూరు జిల్లా ఎమ్మెల్యేలు వంశీకృష్ణ, రాజేష్ రెడ్డి, మెగా రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఉన్నారు.
Similar News
News January 13, 2025
పాలమూరులో అంబరాన్నంటిన భోగి సంబరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా సోమవారం భోగి పండుగ సంబరాలు అంబరాన్నంటాయి. పల్లెల నుంచి పట్టణాల దాకా బంధువులు, స్నేహితులతో కలిసి పెద్ద ఎత్తున భోగి మంటలను వేసి, ప్రజలందరికీ భోగి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఓ వైపు ఇంటి వాకిట్లో రంగురంగుల ముగ్గులు వేశారు. మరోవైపు చిన్నారులు గాలిపటాలు ఎగుర వేశారు. కొందరు స్నేహితులతో కలిసి కొత్త సినిమాలను వీక్షించారు.
News January 13, 2025
NGKL: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్
నాగర్ కర్నూల్ జిల్లా ప్రజలకు కలెక్టర్ బాదావత్ సంతోష్ సోమవారం సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగి సంక్రాంతి కనుమ పండుగలను ప్రజలందరూ భక్తి శ్రద్ధలతో ప్రశాంతంగా చేసుకోవాలని ఆయన కోరారు. సంక్రాంతి పండుగ ప్రజలందరికీ జీవితాలలో వెలుగులు నింపాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరి జీవితాలలో భోగభాగ్యాలు కలగాలని కోరారు.
News January 13, 2025
కల్వకుర్తి: రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం
కల్వకుర్తిలోని <<15140785>>లారీ ఢీకొట్టిన<<>> ఘటనలో ఒకరు మృతిచెందారు. వెంకటాపూర్ గ్రామానికి చెందిన నాగరాజు, వంగూర్ మం. కోనేటిపురం వాసి శ్రీను రాచూరులోని కాఫీ కంపెనీలో పనిచేస్తున్నారు. అదివారం రాత్రి సిల్వర్ జూబ్లీ క్లబ్ ఎదుట కంపెనీ వాహనం కోసం వేచి ఉండగా లారీ వచ్చి ఢీకొట్టింది. దీంతో నాగరాజు లారీ టైర్ల కిందపడి చనిపోగా శ్రీనును ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.