News September 23, 2024
శ్రీశైలంలో హత్యకు గురైన మార్కాపురం యువకుడు

శ్రీశైలంలో ఆదివారం అర్ధరాత్రి మార్కాపురం వాసి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసుల వివరాల ప్రకారం.. బతుకుతెరువు కోసం శ్రీశైలానికి వెళ్లిన ఆవుల అశోక్(32)ను ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో శనివారం రాత్రి అతడిని గొంతు కోసి దారుణ హత్య చేశారని తెలిపారు. ఆదివారం ఉదయం పేపర్లు ఏరుకునే వారు రక్తపు మడుగులో ఉన్న యువకుడిని చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. విచారించి కేసు నమోదు చేశామని పోలీసులు పేర్కొన్నారు.
Similar News
News November 1, 2025
దేవుడు సొమ్ము సైతం గోల్‌మాల్..?

నాగులుప్పలపాడు (M) మట్టిగుంట శివాలయ వ్యవసాయ భూమి 41.5 సెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు రూ.70 లక్షలు గల్లంతైనట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఏటా రూ.10 లక్షలకు పైగా కౌలు ఆదాయం వస్తున్నా 6 నెలలుగా అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రికార్డులు చూపించడంలో ప్రస్తుత EO విఫలమైనట్లు పలువురు ఆరోపించారు. రికార్డుల నిర్వహణ లోపం వల్ల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.

News October 31, 2025
నవంబర్ 30 వరకు యాక్ట్ 30 అమలు: DSP

ప్రకాశం జిల్లాలో నవంబర్ 1 నుంచి 30 వరకు యాక్ట్ 30 అమల్లో ఉంటుందని ఒంగోలు DSP రాయపాటి శ్రీనివాసరావు శుక్రవారం వెల్లడించారు. అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదని సూచించారు. శాంతిభద్రతల పరిరక్షణ నిమిత్తం పోలీస్ శాఖ తీసుకున్న నిర్ణయానికి అందరూ సహకరించాలని కోరారు. నిబంధనలు అతిక్రమిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.