News March 2, 2025
శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్దకు రానున్న సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర పరిధిలోని శ్రీశైలం ఎస్ఎల్బీసీ టన్నెల్ నిర్మాణంలో భాగంగా 8 మంది కార్మికులు చిక్కుకున్న విషయం తెలిసిందే. దీంతో వారిని వెలికి తీసేందుకు ఎనిమిది రోజులుగా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే ఆదివారం సాయంత్రం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి టన్నెల్ వద్దకు రానున్నారు. ఈయన పర్యటనకు సంబంధించి ఐజీ సత్యనారాయణ నేతృత్వంలో భద్రతా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
Similar News
News October 30, 2025
LIC AAO ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

ఎల్ఐసీలో 350 అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్(AAO)- జనరలిస్ట్ పోస్టులకు నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. ఎంపికైన వారి జాబితా <
News October 30, 2025
జూబ్లీ బైపోల్ వైపు.. నార్త్ ఇండియన్స్ చూపు

జూబ్లీహిల్స్లో జరుగుతున్న బైపోల్ నార్త్ ఇండియన్స్ చూపు మనవైపు తిప్పింది. జమ్మూకశ్మీర్, ఝార్ఖండ్, మిజోరం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్ రాష్ట్రాలతో పాటు సౌత్ స్టేట్లోని మనదగ్గర బై పోల్స్ నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఉపఎన్నికలు సౌత్ ఇండియాలో కేవలం తెలంగాణ (జూబ్లిహిల్స్)లోనే జరుగుతోంది. పై రాష్టాలన్నింటిలోకి భిన్నంగా ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉన్నందున పరిస్థితి రిజల్ట్ ఎలా ఉంటుందోననే ఆసక్తి నెలకొంది.
News October 30, 2025
అంతటా 20మంది లోపే.. జూబ్లీహిల్స్లోనే 58 మంది

వచ్చేనెల 11న జరిగే జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో 58 మంది బరిలో ఉన్నారు. ఇదిలా ఉండగా దేశ వ్యాప్తంగా జూబ్లీహిల్స్తో సహా మరో 7 చోట్ల బైపోల్స్ జరుగుతున్నాయి. అక్కడ మాత్రం పోటీచేస్తున్న వారి సంఖ్య 20లోపే ఉంది. బుడ్గాంలో 17(J&K), నగ్రోతలో 10(J&K), ఘట్సిలలో 13(ఝార్ఖండ్), డాంపలో 5 (మిజోరం), నువపడలో 14(ఒడిశా), తర్నతరన్లో 15(పంజాబ్), అంటలో 15(రాజస్థాన్) మంది పోటీలో ఉన్నారు.


