News March 16, 2025
శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారా: భూమన

కడపలోని కాశీనాయన క్షేత్రాన్ని కూల్చడం దారుణమని YCP నేత భూమన కరుణాకర్ రెడ్డి విమర్శించారు. టైగర్ జోన్ కావడంతో కూల్చామని దేవాదాయ శాఖ మంత్రి చెప్పడం చూస్తే శ్రీశైలం క్షేత్రాన్ని కూడా కూల్చేస్తారన్న అనుమానం కలుగుతోందన్నారు. దీనిపై CM నుంచి ఒక్క మాట కూడా రాలేదన్నారు. డిప్యూటీ సీఎం పవన్‌పై సైతం ఆయన విమర్శలు గుప్పించారు. ‘పవనా నంద స్వామి.. దీనిపై తమరు ఎందుకు మాట్లాడటం లేదు’ అని ప్రశ్నించారు.
Similar News
News March 17, 2025
ఆదిలాబాద్: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి

అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి చెందిన ఘటన ఇచ్చోడలో చోటుచేసుకుంది. ఎస్ఐ తిరుపతి వివరాల ప్రకారం.. ఇచ్చోడలోని శివాజీ చౌక్ వద్ద గల పాన్ షాప్ వద్ద సయ్యద్ రావుఫ్ (38) మృతి చెంది పడిఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతుడి బావ మరిది ఆసిఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెల్లడించారు.
News March 17, 2025
కామారెడ్డి: నేడు విద్యుత్ కార్యాలయంలో విద్యుత్ ప్రజావాణి

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని విద్యుత్ కార్యాలయంలో సోమవారం విద్యుత్ ప్రజావాణి నిర్వహిస్తున్నట్లు NPDCL ఎస్సీ, జిల్లా అధికారి శ్రావణ్ కుమార్ తెలిపారు. NPDCL పరిధిలోని సబ్ డివిజన్, సెక్షన్, ఈఆర్వో సర్కిల్ కార్యాలయంలో ప్రతి సోమవారం ఉ.10 గంటల నుంచి 1:00 వరకు అలాగే జిల్లా జిల్లాస్థాయిలో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5 గంటల వరకు వినతులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. దీని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News March 17, 2025
సంగారెడ్డి: జిల్లాకు చేరుకున్న పదో తరగతి ప్రశ్నా పత్రాలు

జిల్లాలో ఈ నెల 21 నుంచి నిర్వహించే పదో తరగతి పబ్లిక్ పరీక్షల ప్రశ్నా పత్రాలు జిల్లాకు చేరుకున్నాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రశ్నా పత్రాలను రూట్ అధికారుల ఆధ్వర్యంలో వివిధ మండల పోలీస్ స్టేషన్ లకు తరలించినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.