News August 28, 2024
శ్రీశైలం జలాశయం UPDATE
శ్రీశైలం జలాశయంలో మంగళవారం 884.3 అడుగుల నీటిమట్టం, 211.4 టీఎంసీల నీటి నిల్వ ఉంది. జూరాల, సుంకేసుల నుంచి 2,08,001 క్యూసెక్కుల వరద శ్రీశైలం డ్యాంకు వచ్చింది. అక్కడి నుంచి మొత్తం 68,744 క్యూసెక్కుల నీటిని సాగర్ కు విడుదల చేస్తున్నారు. 24 గంటల వ్యవధిలో పోతిరెడ్డిపాడు ద్వారా 30వేలు, రేగుమాన్ గడ్డ నుంచి MGKLAకు 1,931, ముచ్చుమర్రి, మల్యాల ఎత్తిపోతల నుంచి HNSSకు 1,490 క్యూసెక్కులు నీటిని విడుదల చేశారు.
Similar News
News September 8, 2024
పాలమూరు జిల్లాలో నీట మునిగిన పత్తి పంట వివరాలు
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 5.74 లక్షల ఎకరాల్లో పత్తిని రైతులు సాగు చేశారు. భారీ వర్షాలకు 2 వేల ఎకరాల వరకు పత్తి పంట నీట మునిగినట్టు వ్యవసాయ శాఖ అధికారుల అంచనాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పంటల పరిశీలన ప్రారంభించామని వ్యవసాయ శాఖ అధికారి బి.వెంకటేష్ తెలిపారు. ప్రభుత్వం ఆదేశాల మేరకు పంట నష్టంపై ప్రాథమిక సమాచారం తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
News September 8, 2024
MBNR: పనిచేయని సీసీ కెమెరాలు..!
ఉమ్మడి పాలమూరు జిల్లాలో ‘నేను సైతం’ కార్యక్రమంలో భాగంగా పోలీసు శాఖ వారి గణాంకాల ప్రకారం ప్రధాన కూడళ్ళు, పట్టణాలు, మండల కేంద్రాల్లో మొత్తం 6,643 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో రూ.లక్షలు వెచ్చించి నేరాల పరిశోధనల్లో, కేసుల ఛేదనలో ఉపయోగపడతాయి అనే ఉద్దేశంతో ఏర్పాటు చేశారు. కానీ నిర్వహణ లోపంతో మొత్తం 1,350 సీసీ కెమెరాలు పనిచేయడం లేదు. దీంతో పోలీసులకు కేసుల ఛేదన సవాలుగా మారుతోంది.
News September 8, 2024
గద్వాల: నీటి గుంతలో పడి పదేళ్ల బాలుడి మృతి
గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలంలో పండగ పూట విషాదం నెలకొంది. నీటి గుంతలో పడి బాలుడు మృతిచెందాడు. స్థానికుల సమాచారం.. తనగల గ్రామ శివారులోని గుట్ట మొరం మట్టిని తరలించగా ఏర్పడిన గుంతలో నీరు నిల్వ నిలిచింది. గ్రామానికి చెందిన బోయ భాస్కర్ కుమారుడు పట్టాభి(10) శనివారం స్నేహితులతో కలిసి వెళ్లి ప్రమాదవశాత్తు ఆ గుంటలో పడి మరణించాడు. ఒక్కగానొక్క కొడుకు మృతితో ఆ తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుయ్యారు.