News July 27, 2024

శ్రీశైలం జలాశయానికి పెరిగిన వరద ప్రవాహం

image

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా పెరిగుతోంది. ఇన్ ఫ్లో 3,43,888 క్యూసెక్కులు.. ఔట్ ఫ్లో 57,300 క్యూసెక్కులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 863.40 అడుగులకు చేరింది. కుడి గట్టు, ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుందని పేర్కొన్నారు.

Similar News

News October 13, 2024

MBNR: ‘BRS కేజీ నుంచి పీజీ విద్య ఉచితమని చెప్పి.. చెవుల పువ్వు పెట్టింది’

image

BRS ప్రభుత్వం కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రజల చెవుల్లో పువ్వు పెట్టిందని NGKL ఎంపీ మల్లు రవి ఆదివారం అన్నారు. ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఒక స్కూల్ నిర్మాణానికి రూ.150 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేస్తుందని గత ప్రభుత్వం విద్యను నిర్వీర్యం చేసిందన్నారు. BRS నాయకులు రూ.7 లక్షల కోట్లు అప్పుచేసి తెలంగాణకు ఏం చేశారని ప్రశ్నించారు.

News October 13, 2024

కొండారెడ్డిపల్లిలో CM ప్రారంభోత్సవాలు ఇలా..

image

వంగూర్ మండలం కొండారెడ్డిపల్లిలో దసరా వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామంలో రూ.55 లక్షలతో అమర జవాను యాదయ్య స్మారక గ్రంథాలయం, రూ.72 లక్షలతో నిర్మించిన కొత్త పంచాయతీ భవనం, రూ.45లక్షలతో BC సామాజిక భవనం, రూ.45 లక్షలతో చేపట్టిన పశు వైద్యశాల భవనాలను CM ప్రారంభించారు. సీఎం హోదాలో తొలిసారి వచ్చి రేవంత్‌కు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

News October 13, 2024

సొంతూరిలో రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన సొంత గ్రామం కొండారెడ్డిపల్లిలో విజయదశమి సందర్భంగా శనివారం సాయంత్రం పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన ప్రజలు సీఎం రేవంత్ రెడ్డికి బ్రహ్మరథం పట్టారు. గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఒకేసారి రోడ్డుపైకి వచ్చి బోనాలతో పాటు తదితర సాంస్కృతిక కార్యక్రమాలతో ఆయనకు స్వాగతం పలికారు. దీంతో సీఎం ఆనందంతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు.