News July 23, 2024
శ్రీశైలం జలాశయానికి భారీగా నీరు చేరిక
శ్రీశైలం జలాశయానికి ఎగువనున్న జూరాల ప్రాజెక్టు క్రస్టు గేట్లు, విద్యుదుత్పత్తి ద్వారా సోమవారం 1,74,717 క్యూసెక్కుల నీటి ప్రవాహం వచ్చి చేరుతుంది అని అధికారులు తెలిపారు. ప్రస్తుతం శ్రీశైలం ప్రాజెక్టులో 832.5 అడుగుల వద్ద 52.1476 టీఎంసీల నీరు నిల్వ ఉంది. 24 గంటల వ్యవధిలో స్థానికంగా 14.0 మి.మీ., వర్షపాతం నమోదైంది. అలాగే శ్రీశైలం జలాశయంలో నుంచి 61 క్యూసెక్కుల నీరు ఆవిరైంది.
Similar News
News October 12, 2024
ఉమ్మడి పాలమూరు జిల్లా నేటి ముఖ్యాంశాలు
✓ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఘనంగా విజయదశమి వేడుకలు.
✓ అలంపూర్: కన్నుల పండుగగా తెప్పోత్సవం.
✓ అలంపూర్: జోగులాంబను దర్శించుకున్న డీజీపీ జితేందర్.
✓ కొండారెడ్డిపల్లిలో అభివృద్ధి పనులను ప్రారంభించి దసరా వేడుకల్లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి.
✓ కల్వకుర్తి: ఉప్పొంగిన దుందుభి వాగు రాకపోకలు బంద్.
✓ రేపు కోడంగల్ రానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
✓ ఉమ్మడి జిల్లాలో ఘనంగా బతుకమ్మ, దేవి నవరాత్రి ఉత్సవాలు.
News October 12, 2024
MBNR: కుంటలో పడి అన్నదమ్ములు మృతి
దసరా వేళ మహబూబ్‌నగర్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. నీట మునిగి అన్నదమ్ములు మృతిచెందారు. స్థానికులు తెలిపిన వివరాలు.. మూసాపేట మండలం స్ఫూర్తి తండాకు చెందిన సక్రు నాయక్ పిల్లలు సాయి(12), సాకేత్(10). సాయి చక్రాపూర్ గ్రామంలో, సాకేత్ MBNRలో చదువుతుండగా దసరా సెలవులకు ఊరికొచ్చారు. ఇవాళ సాయంత్రం ఇంటి సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతిచెందారు. స్థానికులు గమనించి కుంట నుంచి మృతదేహాలను బయటకు తీశారు.
News October 12, 2024
దసరా వేడుకలు.. పంచ కట్టులో రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో తన సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో శనివారం ఘనంగా దసరా వేడుకలు నిర్వహించారు. వేలాదిగా తరలివచ్చిన గ్రామస్థులు, అభిమానులతో కలిసి జమ్మి చెట్టు వద్దకు కాలినడకగా వెళ్లారు. ఎంపీ మల్లు రవి, MLAలు, తన మనవడు, కుటుంబ సభ్యులతో కలిసి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేసిన వేదిక వద్ద గ్రామస్థులకు శుభాకాంక్షలు తెలిపారు.