News July 20, 2024
శ్రీశైలం డ్యాం తాజా సమాచారం
జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం డ్యాంకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో డ్యాం నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం రాత్రి 9 గంటల సమయానికి జూరాల ప్రాజెక్టు గేట్లతో పాటు విద్యుత్ ఉత్పత్తి ద్వారా 99,894 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం డ్యాం నీటిమట్టం 814.5 అడుగులుగా నీటి నిలువ సామర్థ్యం 37.0334 టీఎంసీలుగా నమోదైంది.
Similar News
News October 6, 2024
రహదారులను వేగవంతంగా పూర్తి చేయండి: కలెక్టర్
నేషనల్ హైవే రహదారులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ రంజిత్ బాషా సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం నేషనల్ హైవే అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ఎన్‌హెచ్ 40 భూ సేకరణకు సంబంధించిన నష్ట పరిహారం వెంటనే పంపిణీ చేసేవిధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్‌హెచ్ 340సీకి సంబంధించి బీ.తాండ్రపాడు నుంచి గార్గేయపురం వరకు ఔటర్ రింగ్ రోడ్డు పనులను నవంబర్ 15 నాటికి పూర్తి చేయాలన్నారు.
News October 5, 2024
కర్నూలు: నీటి కుంటలో పడి ఇద్దరు పిల్లల మృతి
నందవరం మండలం మాచాపురంలో విషాదం చోటుచేసుకుంది. బహిర్భూమికి వెళ్లిన ఇద్దరు అన్నదమ్ములు బైరి ఉదయ్ కుమార్(6), అనుమేశ్ ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు పిల్లల మృతి చెందడంతో ఆ కుటుంబంలో విషాద ఛాయాలు అలుముకున్నాయి. నందవరం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
News October 5, 2024
జాతీయస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు జిల్లా క్రీడాకారుడు
ఈనెల 6 నుంచి 13 వరకు హిమాచల్ ప్రదేశ్‌లో జరిగే జాతీయ స్థాయి జూనియర్ నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీలకు కర్నూలు జిల్లా వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారుడు వీరేశ్ ఎంపికైనట్లు జిల్లా కార్యదర్శి షేక్షావల్లి తెలిపారు. శనివారం కర్నూలు అవుట్‌డోర్ స్టేడియంలో వీరేశ్‌ను సత్కరించారు. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి భూపతిరావు, న్యాయవాది శ్రీధర్ రెడ్డి, కోచ్ యుసుఫ్ బాషా పాల్గొన్నారు.