News October 24, 2024

శ్రీశైలం డ్యాం మూడు గేట్లు ఎత్తివేత

image

శ్రీశైలం డ్యామ్ మూడు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా నాగార్జునసాగర్‌కు 84,087 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఉదయం 8 గంటల సమయంలో ఒక్క గేటు ద్వారా నీటి విడుదల ప్రారంభించిన అధికారులు 10 గంటల తర్వాత మరో 2 గేట్లను ఎత్తివేశారు. కాగా బ్యాక్ వాటర్ ద్వారా హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,519 c/s, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 1,600c/s, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 23,250c/s నీటిని విడుదల చేశారు.

Similar News

News November 3, 2024

కొలిమిగుండ్ల పరిధిలో క్రషర్‌లో పడి యువకుడి మృతి 

image

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల పరిధిలోని ఓ పరిశ్రమలో ఆదివారం తెల్లవారుజామున విషాద ఘటన జరిగింది. ప్రమాదవశాత్తు క్రషర్‌లో పడి ఓ యువకుడు మరణించాడు. అందిన వివరాల మేరకు.. మృతుడు సురేశ్ ఆచారి (25) మెకానికల్ హెల్పర్‌గా విధులు నిర్వర్తిస్తున్నట్లు సమాచారం. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బనగానపల్లికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News November 3, 2024

జగన్ హయాంలోనే యురేనియం పరిశీలనకు అనుమతులు: తిక్కారెడ్డి

image

కప్పట్రాళ్ల అడవుల్లో యురేనియం తవ్వకాలపై నిరసన వ్యక్తం అవుతుండటంపై జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు తిక్కారెడ్డి స్పందించారు. జగన్ హయాంలోనే యురేనియం పరిశీలనకు అనుమతులిచ్చారని తెలిపారు. నేడు ఆలూరు వైసీపీ నాయకులు రోడ్లెక్కి సీఎం చంద్రబాబుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల్లో ఆ పార్టీని ప్రజలు 11 సీట్లకు పరిమితం చేసినా వైసీపీ నేతల ప్రవర్తన మారలేదని ఆయన విమర్శించారు.

News November 3, 2024

మంత్రాలయంలో పెరుగుతున్న ట్రాఫిక్ సమస్య

image

మంత్రాలయంలో కొలువైన రాఘవేంద్రస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల వాహనాలతో పోలీసులకు తల నొప్పిగా మారింది. సెలవు రోజులు వచ్చాయంటే భక్తుల సంఖ్యతో వాహనాల రద్దీ పెరిగి పార్కింగ్ స్థలం లేక రోడ్లపైనే తమ వాహనాలను నిలిపేయడం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది. శనివారం కూడా అదే పరిస్థితి నెలకొంది. దీంతో సీఐ రామాంజులు తమ సిబ్బందితో ట్రాఫిక్ నియంత్రణ చేపట్టారు.