News December 7, 2024
శ్రీశైలం డ్యామ్‌ను సందర్శించిన హీరో నాగార్జున
శ్రీశైలం డ్యామ్‌ను ప్రముఖ సినీ హీరో అక్కినేని నాగార్జున శుక్రవారం సందర్శించారు. మల్లన్న దర్శనార్థమై వచ్చిన ఆయన శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తూ మార్గమధ్యలో డ్యామ్ వద్ద కాసేపు ఆగారు. జలాశయం అందాలను తిలకించారు. డ్యామ్ వద్ద ఉపాధి పొందే పలువురు ఫొటోగ్రాఫర్లు నాగార్జునతో ఫొటోలు దిగారు. అంతకుముందు నూతన వధూవరులు అక్కినేని నాగచైతన్య, శోభితతో కలిసి నాగార్జున శ్రీశైలం మల్లన్నను దర్శించుకున్నారు.
Similar News
News February 5, 2025
NGKL: ఘోర రోడ్డు ప్రమాదం.. వివాహిత మృతి
ఫంక్షన్‌కి వెళ్లి వస్తుండగా జరిగిన రోడ్డుప్రమాదంలో ఒకరు చెందిన ఘటన NGKL మండలంలోని చందుబట్ల గేటు వద్ద మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలిలా.. పెంట్లవెల్లికి చెందిన పుష్పలత(47) తన భర్త, కూతురితో కలిసి HYDలో ఫంక్షన్‌కి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో చందుబట్ల గేటు వద్ద కారు కల్వర్టును ఢీకొట్టగా.. పుష్పలత అక్కడికక్కడే మృతి చెందింది. మృతురాలి కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదైందని పోలీసులు తెలిపారు.
News February 5, 2025
MBNR: వివాహితపై లైంగిక దాడి
MBNR జిల్లా నవాబ్‌పేట మండలంలోని ఓ తండాకు చెందిన వివాహితపై అదే గ్రామానికి చెందిన వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గిరిజనతండాకు చెందిన వివాహిత పొలానికెళ్లి వస్తుండగా.. శంకర్‌నాయక్ ఆమెపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
News February 5, 2025
MBNR: ‘క్షయ వ్యాధి పరీక్షల సంఖ్యను పెంచండి’
మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా చేయాలని పరీక్షల సంఖ్యను వెంటనే పెంచాలని మహబూబ్ నగర్ జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులతో మంగళవారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. క్షయ వ్యాధిగ్రస్తులను ముందుగా గుర్తించేందుకు అవసరమైన ఎక్స్ రే లను పెంచాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఎం అండ్ హెచ్ఓ కృష్ణ పాల్గొన్నారు.