News August 1, 2024
శ్రీశైలం డ్యామ్ వద్ద వ్యక్తి గల్లంతు

శ్రీశైలం డ్యామ్ వద్ద నల్గొండ జిల్లా వాసి గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చిట్యాల మున్సిపాలిటీలోని వెంకటాపురంకి చెందిన చొప్పరి యాదయ్య శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనం కోసం తోటి హామాలీలతో వెళ్లాడు. శ్రీశైలం డ్యామ్ వద్ద స్నానానికి వెళ్లి కొట్టుకుపోయినట్లు తెలిసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 25, 2025
మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి: ఇలా త్రిపాఠి

మహిళలు చిత్తశుద్ధితో ముందుకెళ్లాలని కలెక్టర్ ఇలా త్రిపాఠి సూచించారు. మహిళల కోసం మహిళలే అండగా నిలబడాలని అన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం పేద కుటుంబాలకు గౌరవప్రదమైన నివాసాన్ని ఇస్తుందన్నారు. మహిళలు శక్తిగా ఎదగాలని, అన్ని రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు.
News November 25, 2025
నల్గొండ: ఆకట్టుకున్న ఇందిరమ్మ గృహప్రవేశం

మాడ్గులపల్లి మండలం పోరెడ్డిగూడెంలో ఇందిరమ్మ గృహప్రవేశం ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మహిళలంతా ఇందిరమ్మ చీరలు కట్టుకున్నారు. ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్, సబ్ కలెక్టర్ నారాయణ్ అమిత్తో కలిసి వారు ఫొటో దిగగా ఆకట్టుకుంటోంది.
News November 25, 2025
NLG: రిజర్వేషన్లు.. కొందరికి మోదం.. మరికొందరికి ఖేదం

రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా విడుదల చేసిన జీవో 46 ద్వారా ఖరారు చేసిన గ్రామ పంచాయతీ రిజర్వేషన్లతో సీట్లు తారుమారై అలజడి రేపింది. గ్రామాల్లో ఉన్న జనాభా ధామాషా ప్రకారం రొటేషన్ పద్ధతిలో ఈ సారి తమకే రిజర్వేషన్ ఖరారవుతుందనే ఆశతో ఇంతకాలం నిరీక్షించిన నాయకులకు రిజర్వేషన్ల మార్పులతో ఇబ్బందికర వాతావరణం నెలకొంది. జిల్లాలో ఎన్నో రోజులుగా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న రిజర్వేషన్లు కొందరి జాతకాలను తారుమారు చేశాయి.


