News September 1, 2024

శ్రీశైలం డ్యామ్ 10 గేట్లు.. 20 అడుగుల ఎత్తు

image

శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం పెరగటంతో డ్యామ్ 10 గేట్లను 20 అడుగుల ఎత్తుకు పెంచారు. జల వనరుల శాఖ ప్రాజెక్టు ఎస్ఈ శ్రీరామచంద్రమూర్తి స్విచ్ ఆన్ చేసి హైట్‌ను పెంచారు. 2, 3 గేట్లకు సంబంధించి ప్యానల్ బోర్డులో సాంకేతిక లోపం అనే దానిని అధికారులు ఖండించారు. వస్తున్న వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ గేట్ల ఆపరేషన్ చేపడతామని, ప్రస్తుతానికి అన్ని గేట్లు ఆపరేషన్ సక్రమంగా సాగుతుందన్నారు. ఈఈ మోహన్ దాస్ ఉన్నారు.

Similar News

News September 20, 2024

15 శాతం వృద్ధిరేటు సాధించాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రానున్న కాలంలో అన్ని రంగాల్లో దాదాపుగా 15% వృద్ధిరేటు సాధించాలని కలెక్టర్ రంజిత్ బాషా అధికారులను ఆదేశించారు. గురువారం వంద రోజుల ప్రణాళిక అమలుపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. స్వర్ణాంధ్ర @2047 లక్ష్య సాధనలో భాగంగా జిల్లా, మండల స్థాయి ప్రణాళికలను రూపొందించాలని ఆదేశించారు. వ్యవసాయ అనుబంధ రంగాలు, పరిశ్రమలు, మానవ వనరులు, వైద్య విధానం, తదితర వాటిలో అభివృద్ధి ప్రణాళికలు ఉండాలన్నారు.

News September 20, 2024

రాష్ట్రస్థాయి పోటీలకు జిల్లా హ్యాండ్ బాల్ జట్లు

image

ఈనెల 20, 21వ తేదీల్లో కడప జిల్లా వేంపల్లిలో జరిగే 38వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ బాలబాలికల హ్యాండ్ బాల్ జట్లను హ్యాండ్ బాల్ అసోసియేషన్ ప్రతినిధి చిన్న సుంకన్న ప్రకటించారు. గురువారం కర్నూలు డీఎస్ఏ అవుట్డోర్ స్టేడియంలో ఏర్పాటు చేసిన జిల్లా జట్టుకు ఎంపికైన హ్యాండ్ బాల్ సబ్ జూనియర్స్ క్రీడాకారులకు టీషర్టులు పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా న్యాయవాది శ్రీధర్ రెడ్డి హాజరయ్యారు.

News September 19, 2024

క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించండి: మంత్రి టీజీ భరత్

image

కర్నూలు నుంచి విజయవాడ జంక్షన్‌కు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని రైల్వేశాఖ స‌హాయ మంత్రి వీ.సోమ‌ణ్ణ‌ను రాష్ట్ర మంత్రి టీజీ భ‌ర‌త్ కోరారు. ఢిల్లీలో కేంద్ర మంత్రి సోమ‌ణ్ణ‌ను భ‌ర‌త్ క‌లిసి రైల్వే స‌మ‌స్య‌ల‌పై విన‌తిప‌త్రం అందించారు. క‌ర్నూలు నుంచి విజ‌య‌వాడ‌కు ప్ర‌తి రోజూ రైలు, క‌ర్నూలు నుంచి ముంబైకి వారంలో ఒక‌టి లేదా రెండు సార్లు రైలు సౌక‌ర్యం క‌ల్పించాల‌ని కోరారు.