News September 6, 2024
శ్రీశైలం ప్రాజెక్టు రెండు గేట్లు ఓపెన్
ఎగువ నుంచి వరద ప్రవాహం వస్తుండడంతో శ్రీశైలం ప్రాజెక్టుకు మళ్లీ వరద పెరిగింది. దీంతో అధికారులు శుక్రవారం రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. జూరాల ప్రాజెక్టు నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1,33, లక్షల క్యూసెక్కుల నీటి ప్రవాహం వస్తుంది. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులకు గాను ప్రస్తుత నీటిమట్టం 884.80 అడుగులుగా ఉంది. స్పిల్ వే ద్వారా 55.874 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Similar News
News October 11, 2024
MBNR: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
MBNR, NGKL,GDWL, NRPT,WNP జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
News October 11, 2024
వనపర్తి: స్వీపర్ కూతురు టీచర్..!
వనపర్తి జిల్లా పాన్‌గల్ మండలం మాధవరావుపల్లి గ్రామానికి చెందిన మండ్ల వెంకటయ్య ప్రభుత్వ స్కూల్‌లో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన కూతురు వనిత డీఎస్సీ ఫలితాలల్లో సెకండరీ గ్రేడ్ టీచర్ SGT జాబ్ సాధించింది. కాగా నాన్నకు తోడుగా స్వీపర్‌గా సాయం చేసేది. వనిత తల్లిదండ్రులు మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే చదువులో ముందంజలో ఉంటూ ఉద్యోగాన్ని సాధించినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు, గ్రామస్థులు ఆమెను అభినందించారు.
News October 11, 2024
ఉమ్మడి జిల్లాకు 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు మంజూరు
ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు రాష్ట్ర ప్రభుత్వం 7 ఇంటిగ్రేటెడ్ పాఠశాలలను మంజూరు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ పాఠశాలలను ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తుంది. జడ్చర్ల, దేవరకద్ర, కొల్లాపూర్, అచ్చంపేట, నాగర్ కర్నూల్, కొడంగల్, కొందుర్గు పట్టణాల్లో పాఠశాలలను ఏర్పాటు చేయనున్నారు. పలు చోట్ల నిర్మాణానికి పూజలు చేస్తున్నారు.