News February 17, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

శ్రీశైలం మహా క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనునున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం శ్రీనివాసరావు ఆహ్వానపు పత్రికను అందజేశారు. ఈమేరకు అమరావతిలోని వెలగపూడిలో గల సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు.
Similar News
News November 27, 2025
KNR: ‘రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించాలి’

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై హైదరాబాదులో మంత్రి ఉత్తం కుమార్ రెడ్డిని కరీంనగర్ రైస్ మిల్ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. తమ సమస్యలపై స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు. రైస్ మిల్లర్ల సమస్యలు పరిష్కరించేందుకు సివిల్ సప్లై కమిషనర్ స్టీఫెన్ రవీంద్రతో ఫోన్లో మాట్లాడి సమస్యలపై పరిష్కారం చూపాలని తెలిపినట్లు రైస్ మిల్ అసోసియేషన్ సభ్యులు తెలిపారు.
News November 27, 2025
తిరుమల వివాదం.. సీఐడీ మకాం విజయవాడలో.!

తిరుమల పరకామణీ చోరీ కేసు డిసెంబర్ 2వ తేదీ నివేదిక కోర్టుకు సమర్పించాల్సిన నేపథ్యంలో సీఐడీ బృందం వేగంగా విచారణ చేస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులు, బోర్డు సభ్యులను విచారించిన అధికారులు వైవీ సుబ్బారెడ్డి, పూర్వపు తిరుపతి ఎస్పీ పరమేశ్వర రెడ్డితో సహా మరికొంత మందిని విచారణకు పిలవనున్నారు. తిరుపతిలో ప్రారంభమైన విచారణ ప్రస్తుతం విజయవాడ కేంద్రంగా సాగుతోంది.
News November 27, 2025
సాధారణ ప్రసవాలు చేయాలి: మంచిర్యాల DMHO

జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులందరూ సాధారణ ప్రసవాలకు ముందుండాలని, సిజేరియన్లకు దూరంగా ఉండాలని DMHO డా.అనిత ఆదేశించారు. జిల్లా కార్యాలయంలో ప్రైవేట్ ఆసుపత్రుల గైనకాలజిస్టులతో ఆసుపత్రులలో ప్రసవాలు, లింగ నిర్ధారణపై గురువారం సమీక్ష నిర్వహించారు. మొదటి ప్రసవానికి వచ్చే వారికి సాధారణ ప్రసవం చేయాలన్నారు. ధరల పట్టికలు, అందిస్తున్న వైద్య సేవల వివరాలను గోడపై అతికించాలని సూచించారు.


