News February 17, 2025
శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సీఎం చంద్రబాబు ఆహ్వానం

శ్రీశైలం మహా క్షేత్రంలో ఫిబ్రవరి 19 నుంచి మార్చి ఒకటో తేదీ వరకు జరగనునున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు హాజరుకావాలని సీఎం చంద్రబాబుకు శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి, దేవస్థానం శ్రీనివాసరావు ఆహ్వానపు పత్రికను అందజేశారు. ఈమేరకు అమరావతిలోని వెలగపూడిలో గల సచివాలయంలో సీఎం చంద్రబాబును మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. అలాగే స్వామివారి శేష వస్త్రాలు, ప్రసాదాన్ని అందజేశారు.
Similar News
News March 25, 2025
క్షయ వ్యాధి నివారణలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉంది

క్షయ వ్యాధి నివారణలో చికిత్సను అందించడంలో మహబూబ్ నగర్ మొదటి స్థానంలో ఉందని జిల్లా కలెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్‌లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. క్షయ నివారణలో జిల్లా అధికారులు ఎంతో క్రమశిక్షణతో పని చేస్తున్నారని ఈ సందర్భంగా అభినందించారు. గతేడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు 2,087 మందికి టీబి చికిత్స అందించినట్లు వెల్లడించారు.
News March 25, 2025
నేడు, రేపు సీఎం అధ్యక్షతన కలెక్టర్ల సమావేశం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన రెండు రోజులపాటు జిల్లా కలెక్టర్ల సమావేశం జరగనుంది. ఇవాళ ఉ.10 గంటలకు CCLA ప్రారంభ ఉపన్యాసం, ఆ తర్వాత CS, మంత్రుల ప్రసంగాలు ఉంటాయి. అనంతరం కలెక్టర్ల సమావేశంపై సీఎం ప్రసంగిస్తారు. నేడు వాట్సాప్ గవర్నెన్స్, ల్యాండ్ సర్వే, ఆర్టీజీఎస్, గ్రామాలు, పట్టణాల్లో నీటి సరఫరా, ఆదాయ మార్గాలు, రెవెన్యూ సమస్యలపై చర్చించనున్నట్లు సమాచారం.
News March 25, 2025
బండి సంజయ్‌పై క్రిమినల్ కేసు పెట్టాలి: బీఆర్ఎస్

TG: మాజీ సీఎం, BRS అధినేత KCRపై కేంద్ర మంత్రి బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆ పార్టీ నేతలు బంజారాహిల్స్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు. సంజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. ‘కేసీఆర్‌కు బీదర్‌లో దొంగనోట్లు ముద్రించే ప్రింటింగ్ ప్రెస్ ఉంది. అక్కడ ప్రింట్ చేసిన డబ్బునే ఎన్నికల సమయంలో ఓటర్లకు పంచారు’ అని సంజయ్ వ్యాఖ్యానించారని BRS తన ఫిర్యాదులో పేర్కొంది.