News August 6, 2024
శ్రీశైలం మల్లన్న దంపతులకు వెండి రథోత్సవం

శ్రీశైలంలో కొలువైన శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జునస్వామి వార్లకు సోమవారం రాత్రి శ్రావణమాసం పురస్కరించుకుని వెండి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ఈఓ పెద్దిరాజు ఆధ్వర్యంలో ముందుగా అర్చకులు, పండితులు స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెండి రథం మీద కొలువైన స్వామి, అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో వెండి రథోత్సవం వైభవంగా జరిగింది.
Similar News
News February 15, 2025
కర్నూలులో మెడికల్ విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

కర్నూలు మెడికల్ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. అందిన వివరాల మేరకు.. ఎంబీబీఎస్ రెండో సంవత్సరం చదువుతున్న రమ్యతేజ అనే విద్యార్థిని హాస్టల్‌లో పురుగు మందు తాగారు. గమనించిన సిబ్బంది వెంటనే ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు. రమ్యతేజ అనంతపురానికి చెందిన యువతిగా తెలుస్తోంది. ఘటనకు కారణాలు తెలియాల్సి ఉంది.
News February 15, 2025
కర్నూలు మీదుగా మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు

ఏపీ టూరిజం ఆధ్వర్యంలో యూపీ ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళాకు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. ఈనెల 17న తిరుపతి, ఒంటిమిట్ట, ఓర్వకల్లు, కర్నూలు, హైదరాబాద్, బాసర, వారణాశి మీదుగా ప్రయాగ్‌రాజ్ చేరుకుంటుంది. తిరిగి జబల్‌పూర్, హైదరాబాద్, కర్నూలు, మహానంది మీదుగా తిరుపతి చేరుకుంటుంది. ఈ బస్సు 17న మ.2.15 గంటలకు కర్నూలుకు వస్తుంది. టికెట్ ధర రూ.20వేలు, పిల్లలకు రూ.17, 200లుగా నిర్ణయించారు.
News February 15, 2025
కర్నూలులో బర్డ్ ఫ్లూ.. ‘ఆందోళన అవసరం లేదు’

కర్నూలులో బర్డ్ ఫ్లూపై ఆందోళన అవసరం లేదని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ జి.శ్రీనివాస్ తెలిపారు. నగరంలోని నరసింహారావు పేటను రెడ్ జోన్‌గా గుర్తించి చికెన్, గుడ్ల అమ్మకాలను నిలిపివేశామని తెలిపారు. మిగిలిన ప్రాంతాల్లో చికెన్, గుడ్ల అమ్మకం కొనసాగుతుందన్నారు. చికెన్‌ను 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో ఉడికించి తింటే ఎలాంటి ప్రమాదం ఉండదని స్పష్టం చేశారు.