News February 24, 2025
శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిన గవర్నర్

శ్రీశైలం మల్లన్న దర్శనార్థమై రాష్ట్ర గవర్నర్ శ్రీశైలం చేరుకున్నారు. ఈ సందర్భంగా హెలీప్యాడ్ వద్ద మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, ఫారుక్, బీసీ జనార్దన్రెడ్డి, ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి, నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి, ఇన్ఛార్జ్ ఎస్పీ విక్రాంత్ పాటిల్, జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.
Similar News
News October 17, 2025
పాలమూరు బిడ్డకు బంగారు పతకం

NGKL(D) బిజినేపల్లి(M) వెలుగొండకి చెందిన నాగయ్య కుమార్తె ఈర్ల అరుణ ఎం-ఫార్మసీ విభాగంలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. పీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతుల మీదగా గోల్డ్ మెడల్ అందుకున్నారు. వ్యవసాయ నేపథ్యంతో వచ్చిన ఆమె పీయూలో పీజీ సీటు సాధించడంతో ఇంట్లో అంత దూరం పెళ్లి చదువుతావా అన్నారు. గవర్నర్ చేతుల మీదగా గోల్డ్ మెడల్ అందుకోవడం చాలా సంతోషంగా ఉందని Way2Newsతో తెలిపారు.
News October 17, 2025
మరోసారి బ్యాంకుల విలీనం!

ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో(PSB) మరో మెగా విలీనానికి రంగం సిద్ధమవుతోంది. చిన్న బ్యాంకులైన ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రను SBI, PNB, BOBలో విలీనం చేసే ఫైల్ త్వరలో PM కార్యాలయానికి చేరనుంది. దీంతో PSBల సంఖ్య 8 కానుంది. ఆర్థిక సంస్కరణలు, ఫిన్టెక్ కంపెనీలు, ప్రైవేటు బ్యాంకుల పోటీని తట్టుకోవడానికి ఈ విలీనం తప్పనిసరని కేంద్రం భావిస్తోంది.
News October 17, 2025
స్థానిక సంస్థల ఎన్నికలపై హైకోర్టులో మరో పిటిషన్

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టులో మరో పిటిషన్ వేశారు. స్థానిక సంస్థల ఎన్నికలకు రీ నోటిఫికేషన్ ఇచ్చి ఎన్నికలు నిర్వహించాలని పిటిషన్ వేశారు. ఈ నెల 9న స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ సస్పెండ్ చేస్తూ స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఉత్తర్వులు ఇచ్చింది. నోటిఫికేషన్ను సస్పెండ్ చేయడానికి సవాలు చేస్తూ సురేందర్ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. మరికాసేపట్లో హై కోర్ట్లో విచారణ జరగనుంది.