News September 16, 2024
శ్రీశైలం మల్లన్న సన్నిధిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి
ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణ రావు కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం రాత్రి శ్రీశైలం ఆలయానికి వచ్చారు. శ్రీ భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి వారి దర్శనార్థం వచ్చిన ఆయనకు ఆలయ ఈఓ పెద్దిరాజు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు స్వామి అమ్మవారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు చేపట్టారు. దర్శనం అనంతరం ఆలయ అధికారులు స్వామివారి ప్రసాదాలు అందించి సత్కరించారు.
Similar News
News October 6, 2024
కర్నూలు: జాతీయస్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం విద్యార్థి ఎంపిక
కర్నూలు ఆదర్శ విద్యా మందిరంలో ఈ నెల 2, 3వ తేదీల్లో రాష్ట్రస్థాయిలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్-19 జాతీయ స్థాయి రగ్బీ పోటీలకు లక్ష్మాపురం గురుకులం బాలిక జ్యోతి ఎంపికైంది. ఈ మేరకు వ్యాయామ ఉపాధ్యాయురాలు లావణ్య ఆదివారం తెలిపారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికవ్వడం పట్ల జ్యోతిని పాఠశాల అధ్యాపక బృందం అభినందించారు.
News October 6, 2024
నంద్యాల: టైరు పేలి గ్యాస్ సిలిండర్ల ఆటో బోల్తా
బనగానపల్లె మండలం యనకండ్ల సమీపంలో ఆదివారం ఉదయం గ్యాస్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో టైర్ పేలి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ప్రమాదం జరగలేదు. బనగానపల్లె నుంచి యనకండ్లకు వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్లు పేలి ఉంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని పేర్కొన్నారు.
News October 6, 2024
చిన్న చెరువులో మృతదేహం లభ్యం
అవుకు రిజర్వాయర్ సమీపంలోని చిన్న చెరువులో శనివారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైనట్లు పోలీసులు వెల్లడించారు. జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా నీటి ప్రవాహానికి మృతదేహం కొట్టుకొని వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహం గుర్తుపట్టలేనంతగా కూళ్లిపోయి ఉందని తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.