News October 22, 2024
శ్రీశైలం మల్లన్న సేవలో సినీ నిర్మాత దిల్ రాజు

శ్రీశైలం శ్రీ భ్రమరాంబిక సమేత మల్లికార్జున స్వామివారిని ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు దర్శించుకున్నారు. ఆయన మల్లికార్జున స్వామికి రుద్రాభిషేకం, భ్రమరాంబాదేవిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆయనకు ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్స్ నిర్మాణ సంస్థను స్థాపించి తెలుగులో పలు విజయవంతమైన చిత్రాలను ఆయన నిర్మించారు.
Similar News
News July 10, 2025
ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోల పాత్ర కీలకం: ఆర్వో

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశమైన మనదేశంలో ఎన్నికల ప్రక్రియలో బీఎల్‌వోల పాత్ర కీలకమైందని కర్నూలు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ రవీంద్ర బాబు అన్నారు. బుధవారం ఎస్బీఐ కాలనీలోని నగరపాలక సమావేశ భవనంలో బీఎల్‌లోలకు శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎన్నికల సమయంలో బీఎల్‌వోలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఎల్ఓకు 6 రోజులు శిక్షణ ఉంటుందన్నారు.
News July 9, 2025
కర్నూలు మాజీ ఎంపీకి గోల్డ్ మెడల్

కర్నూలు మాజీ ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్‌కు గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ బుధవారం విజయవాడలో అందజేశారు. 17వ పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిన సమయంలో జిల్లాలో రెడ్ క్రాస్ సొసైటీకి చేసిన సేవలకు గాను ఈ మెడల్ అందజేసి, సన్మానించారు. గవర్నర్‌తో పాటు రెడ్ క్రాస్ సొసైటీ ప్రతినిధులకు ఎంపీ ధన్యవాదాలు తెలిపారు.
News July 9, 2025
మద్దికేరలో ఆక్సిండెంట్.. ఒకరి మృతి

మద్దికేరలోని బురుజుల రోడ్డులో రెండు బైకులు ఢీకొని ఒకరు మృతి చెందారు. మృతుడిని కైరుప్పలకు చెందిన తిరుమల యాదవ్(24)గా పోలీసులు గుర్తించారు. గుంతకల్లు మండలం గుళ్లపాలెంలో భార్యను చూసి సొంతూరుకు వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ నాయక్ తెలిపారు.