News May 26, 2024
శ్రీశైలం వద్ద సమాధిని ఢీకొట్టిన కారు

శ్రీశైలం సమీపంలోని రామయ్య మలుపు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. శ్రీశైలానికి వస్తున్న రెండు కార్లు స్పీడ్ బ్రేకర్ వద్ద అదుపు తప్పాయి. దీంతో ఒక వాహనాన్ని మరో వాహనం వెనుక నుంచి ఢీకొట్టింది. ఆ కారు అదుపు తప్పి పక్కనే ఉన్న సమాధిపైకి దూసుకెళ్లింది. ప్రమాదంలో ఎవరికీ ఏమీ కాకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News April 15, 2026
పీజీఆర్ఎస్ అర్జీలకు వేగవంత పరిష్కారం: కలెక్టర్

పీజీఆర్ఎస్‌లో వచ్చిన అర్జీలను వేగంగా, నాణ్యతతో పరిష్కరించాలని కలెక్టర్ ఏ.సిరి రిజిస్ట్రేషన్ శాఖ అధికారులకు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆమె మాట్లాడారు. ప్రతీ రోజు లాగిన్‌లో అర్జీలను పరిశీలించి, వెంటనే స్పందించాలని సూచించారు. ప్రజలకు పారదర్శక సేవలు అందించి సానుకూల స్పందన శాతాన్ని పెంచాలని తెలిపారు. జిల్లాలో 104 శాతం ఆదాయం సాధించడంపై ప్రశంసించారు.
News April 15, 2026
కర్నూలు జిల్లా విద్యార్థుల ప్రతిభ ఇలా..

కర్నూలు జిల్లా ఇంటర్ ఫలితాల వివరాలను ఆర్ఐఓ లాలప్ప వెల్లడించారు. ఉత్తీర్ణతలో బీసీ రెసిడెన్షియల్ కళాశాలలు ప్రథమ సంవత్సరంలో 97%, ద్వితీయ సంవత్సరంలో 100% ఫలితాలతో అగ్రస్థానంలో నిలిచాయి. ఏపీఆర్ఎస్ నుంచి 91%, 97% సాధించగా, ప్రభుత్వ కళాశాలలు 44%, 71% ఫలితాలు నమోదు చేశాయి. ప్రైవేట్ విద్యాసంస్థలు 71%, 85% ఉత్తీర్ణత సాధించాయి. విద్యార్థుల ప్రతిభపై అధికారులు హర్షం వ్యక్తం చేశారు.