News February 20, 2025
శ్రీశైలం వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్

శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ అధికారులు కీలక సూచన చేశారు. దోర్నాల, శిఖరం చెక్ పోస్ట్‌ల వద్ద ఈ నెల 24 నుంచి 28 వరకు వాహనాలకు 24 గంటల అనుమతి ఉందని రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. తెలంగాణ పరిధిలోని మన్ననూరు, దోమలపెంట వద్ద 23 నుంచి మార్చి 1 వరకు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే 24 గంటలు అనుమతిస్తామని రేంజర్స్ రవికుమార్, గురు ప్రసాద్ వెల్లడించారు.
Similar News
News October 19, 2025
రేపు ప్రజా సమస్యల పరిష్కార వేదిక రద్దు: కలెక్టర్

అనంతపురం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికను రద్దు చేసినట్లు కలెక్టర్ ఆనంద్ ఆదివారం ప్రకటించారు. సోమవారం దీపావళి సందర్భంగా ప్రభుత్వ సెలవు ఉన్నందున ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహించడం లేదని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని విజ్ఞప్తి చేశారు.
News October 19, 2025
కొనసాగుతున్న వర్షం.. తగ్గనున్న ఓవర్లు!

భారత్, ఆస్ట్రేలియా తొలి వన్డేకు వర్షం మరోసారి అంతరాయం కలిగించింది. భారత స్కోర్ 25-2 ఉన్నప్పుడు వర్షంతో తొలిసారి అంతరాయం కలగ్గా అంపైర్లు మ్యాచ్‌ను 49 ఓవర్లకు కుదించారు. తర్వాత 11.5 ఓవర్లలో స్కోర్ 37-3 ఉన్న సమయంలో వర్షం మళ్లీ స్టార్ట్ అయింది. తీవ్రత ఎక్కువగా ఉండటంతో ఇప్పటికే గంటకు పైగా మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మరిన్ని ఓవర్లు కోల్పోయే అవకాశముంది.
News October 19, 2025
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

సైబర్ నేరాలు, ఆన్లైన్ మోసాల బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ రఘునాథ్ అన్నారు. దేశవ్యాప్తంగా పెరుగుతున్న టెక్నాలజీకి తగ్గట్టుగానే సైబర్ నేరాలు విజృంభిస్తున్న నేపథ్యంలో సైబర్ నేరాలు, ఆన్ లైన్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. వాట్సప్ ద్వారా వచ్చే ఏపీకే అప్లికేషన్లు ఎట్టి పరిస్థితిలో డౌన్లోడ్ చేయరాదని సూచించారు.