News February 20, 2025
శ్రీశైలం వెళ్లే యాత్రికులకు బిగ్ అలర్ట్

శివరాత్రి బ్రహ్మోత్సవాల వేళ శ్రీశైలం వెళ్లే భక్తులకు అటవీ అధికారులు కీలక సూచన చేశారు. దోర్నాల, శిఖరం చెక్ పోస్ట్ల వద్ద ఈ నెల 24 నుంచి 28 వరకు వాహనాలకు 24 గంటల అనుమతి ఉందని రేంజర్ జీవన్ కుమార్ తెలిపారు. తెలంగాణ పరిధిలోని మన్ననూరు, దోమలపెంట వద్ద 23 నుంచి మార్చి 1 వరకు కేవలం ఆర్టీసీ బస్సులను మాత్రమే 24 గంటలు అనుమతిస్తామని రేంజర్స్ రవికుమార్, గురు ప్రసాద్ వెల్లడించారు.
Similar News
News February 22, 2025
కర్నూలు జిల్లా TODAY TOP NEWS..!

➤ విద్యార్థిని అశ్లీల చిత్రాలతో వ్యాపారం.. నిందితుల అరెస్టు. ➤ కర్ణాటక సీఎం సిద్దరామయ్యకు గురు భక్తి ఉత్సవాల ఆహ్వాన పత్రిక. ➤ వలసలు వెళ్లకుండా పనులు కల్పించాలని కలెక్టర్ ఆదేశాలు. ➤ జాతీయ స్థాయి స్కాలర్షిప్లో కోసిగి విద్యార్థుల ప్రతిభ. ➤ వరి రైతులను ముప్పుతిప్పలు పెడుతున్న విదేశీ పర్ఫాల్ స్వాపెన్ పక్షులు. ➤ కర్నూలు: రెండుసార్లు కవల పిల్లలకు జన్మనిచ్చారు. ➤ జిల్లాలో రెచ్చిపోతున్న హిజ్రాలు.
News February 22, 2025
కర్నూలు: రెవెన్యూ అధికారులతో సబ్ కలెక్టర్ సమీక్ష

గోనెగండ్ల మండలం తహశీల్దార్ కార్యాలయంలో పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెసెల్ సిస్టమ్, రీ ఓపెన్, గ్రామసభ, రెవెన్యూ సభ, రెవెన్యూ సంబంధించిన అంశాలపై ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షించారు. పెండింగ్ భూ సమస్యల స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా ప్రజా సమస్యల పరిష్కాానికి కృషి చేయాలని ఆదేశించారు. తహశీల్దార్ కుమారస్వామి, డీటీ విష్ణుప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
News February 22, 2025
కర్నూలు: ‘రెండుసార్లు కవల పిల్లలకు జన్మినిచ్చారు’ (PHOTO)

నేడు అంతర్జాతీయ కవలల దినోత్సవంగా జరుపుకుంటారు. కర్నూలు జిల్లా నందవరం గ్రామానికి చెందిన ఫక్కీరప్ప, కృపావతి దంపతులు మొదట ఇద్దరు ఆడ కవల పిల్లలకు జన్మినిచ్చారు. రెండో కాన్పులో ఇద్దరు మగ కవల పిల్లలను కన్నారు. వారికి స్నేహ, శ్వేత, అఖిల్, నిఖిల్గా నామకరణం చేశారు. కవల పిల్లలతో తాము సంతోషంగా ఉన్నామని తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.