News December 24, 2024
శ్రీశైలం: 0.692 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి

శ్రీశైలంలోని ఎడమ విద్యుత్ కేంద్రంలో సోమవారం 0.692 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి చేపట్టారు. ఇందుకోసం జలాశయం నుంచి 1406 క్యూసెక్కుల నీటిని వినియోగించుకున్నారు. అదే క్రమంలో హెచ్ఎంఎస్ఎస్ కు 1645 క్యూసెక్కులు, మహాత్మా గాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్‌కు 2291 క్యూసెక్కులు, కేసీ కెనాల్‌కు 245 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడుకు 1500 క్యూసెక్కుల చొప్పున మొత్తం 7296 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు.
Similar News
News October 14, 2025
కర్నూలుకు మోదీ.. పాఠశాలలకు సెలవు

ప్రధాని నరేంద్ర <<18001308>>మోదీ<<>> ఈ నెల 16న కర్నూలు, నంద్యాల జిల్లాల్లో పర్యటించనుండటంతో 15, 16 తేదీల్లో నాలుగు మండలాల పరిధిలోని అన్ని యాజమాన్యాల విద్యాసంస్థలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ శామ్యూల్ పాల్ తెలిపారు. కర్నూల్ అర్బన్, రూరల్, కల్లూరు, ఓర్వకల్ మండలాల పాఠశాలలకు ఈ సెలవు వర్తిస్తుందని చెప్పారు. FA-2 పరీక్షలు 21, 22వ తేదీలలో నిర్వహించాలని ఆదేశించారు.
News October 14, 2025
కర్నూలు జిల్లా గిరిజన సంక్షేమ ఆఫీసర్‌గా సురేష్

కర్నూలు జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా దేవల్ల సురేష్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..గిరిజన సంక్షేమ హాస్టల్లో వసతులు మెరుగుపడేలా, ఎలాంటి అసౌకర్యం రాకుండా గిరిజన సంక్షేమ హాస్టల్లో అభివృద్ధి చేసేలా కృషి చేస్తానని తెలిపారు. సురేష్ గతంలో అనంతపూర్ గిరిజన సంక్షేమ కార్యాలయంలో సూపరింటెండెంట్‌గా విధులు నిర్వహిస్తూ డీటీడబ్ల్యూఓగా పదోన్నతి పొంది కర్నూలుకు బదిలీ అయ్యారు.
News October 13, 2025
మంత్రాలయంలో 727 టీచర్ పోస్టులు భర్తీ

మంత్రాలయం నియోజకవర్గానికి అత్యధికంగా 727 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం హర్షనీయమని టీడీపీ ఇన్ఛార్జ్ రాఘవేంద్రరెడ్డి తెలిపారు. ఆదివారం మంత్రాలయం మండలం మాధవరంలో ఆయన మాట్లాడారు. మెగా డీఎస్సీ ద్వారా తన నియోజకవర్గంలో ఎక్కువ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయడంపై మంత్రి లోకేశ్‌కు కృతజ్ఞతలు తెలిపారు. మంత్రాలయంలో 121, పెద్దకడబూరులో 92, కోసిగిలో 256, కౌతాళంలో 257 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయడం జరిగిందన్నారు.