News September 4, 2024
శ్రీశైలం UPDATE.. నీటి మట్టం 883.80 అడుగులు
శ్రీశైలం జలాశయం నుంచి నీటి విడుదల కొనసాగుతోంది. 10 గేట్లను ఎత్తి 2,70,470 క్యూసెక్కులు, కుడి, ఎడమ జల విద్యుత్తు కేంద్రాల ద్వారా 67,217 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. మంగళవారం సాయంత్రం 6 గంటలకు జలాశయంలో నీటి మట్టం 883.80 అడుగులకు చేరింది. జూరాల నుంచి 2,08,511 క్యూసెక్కులు, సుంకేసుల జలాశయం నుంచి 10,326 క్యూసెక్కుల వరద శ్రీశైలం జలాశయానికి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు.
Similar News
News September 17, 2024
WNP: రికార్డు ధర పలికిన వినాయకుడి లడ్డూ
వనపర్తి గ్రీన్ పార్క్ వినాయకుడి పెద్ద లడ్డూ రూ.2,50,116ల రికార్డు ధర పలికిందని గ్రీన్ పార్క్ యూత్ తెలిపారు. సమాధాన్ జాదవ్ వేలంపాటలో ఈ లడ్డూ దక్కించుకున్నాడన్నారు. పట్టణంలోనే రికార్డు ధరగా భావిస్తున్నామని చెప్పారు. చిన్న లడ్డు లక్ష్మీ బాలరాజ్ రూ.8,511కు, నోట్ల దండ పుష్పలత రూ.40,116కు, కలశం రమేష్ రూ.40,116కు, ఆపిల్ పండ్లు మద్దిలేటి రూ.10,116 వేలం పాటలో పొందారన్నారు. ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News September 17, 2024
MBNR క్విజ్.. వీటికి సమాధానాలు తెలుసా?
☞సురవరం ప్రతాపరెడ్డి జన్మించిన గ్రామం?
☞ఉమ్మడి జిల్లాలో ఏర్పాటైన తొలి ప్రాజెక్టు?
☞‘శతపత్రం’ పుస్తకాన్ని ఎవరు రచించారు?
☞గద్వాల కోటను ఎవరు నిర్మించారు?
☞శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు?
★పై ప్రశ్నలకు సమాధానాలను కామెంట్ చేయగలరు?
నోట్: మధ్యాహ్నం 2 గంటలకు ఇదే ఆర్టికల్‌లో జవాబులను చూడోచ్చు.
SHARE IT..
News September 17, 2024
జూరాల ప్రాజెక్టుకు తగ్గిన ఇన్ ఫ్లో
జూరాలకు ఎగువ నుంచి ఇన్ ఫ్లో మరింత తగ్గు ముఖం పట్టినట్లు పీజేపీ అధికారులు తెలిపారు. సోమవారం సాయంత్రానికి కేవలం 30వేల క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉన్నట్లు వివరించారు. కాగా 9 యూనిట్ల విద్యుత్తు ఉత్పత్తి అవుతోంది. ఈ మేరకు 22,241 క్యూసెక్కుల నీరు వినియోగిస్తున్నారు. మొత్తంగా 24, 695 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతోంది. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.275 టీఎంసీల నీరు నిల్వ ఉంది.