News March 26, 2025
శ్రీశైలానికి కన్నడిగుల సాహస యాత్ర

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో వేలాది మంది కన్నడిగులు పాదయాత్రతో శ్రీశైలం చేరుకుంటున్నారు. వందల కిలోమీటర్ల నుంచి వస్తూ ఆత్మకూరు సమీపంలో కాళ్లకు కర్రలు కట్టుకొని దట్టమైన నల్లమల అడవులలో సాహస యాత్రను చేపడుతున్నారు. వారి పాదయాత్రను చూసి స్థానిక ప్రజలు కన్నడిగుల భక్తికి ఇదే నిదర్శనమని పేర్కొంటున్నారు. కాగా ఈ నెల 31 వరకు ఉగాది మహోత్సవాలు జరగనున్నాయి.
Similar News
News April 25, 2025
కర్నూలు: 4,348 మందికి జూన్ 1న ఫైనల్ పరీక్ష

కానిస్టేబుల్ అభ్యర్థులకు జూన్ 1న ఫైనల్ పరీక్ష నిర్వహించనున్నారు. కానిస్టేబుల్, సివిల్, ఏపీఎస్పీ విభాగాల్లో పోస్టులకు సంబంధించి ప్రిలిమినరీ రాత పరీక్ష 2023 జనవరి 22న జరిగింది. అర్హత సాధించిన వారికి గతేడాది డిసెంబర్ నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 1 వరకు కర్నూలులో దేహదారుఢ్య పరీక్షలు నిర్వహించారు. అందులో 4,348 మంది తుది రాత పరీక్షకు అర్హత సాధించారు. వారందరికీ జూన్ 1న మెయిన్ పరీక్ష నిర్వహించనున్నారు.
News April 25, 2025
కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య!

కుమారుడు ఫెయిల్ అయ్యాడని తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన కర్నూలులో జరిగింది. పోలీసుల వివరాల మేరకు.. లేబర్ కాలనీకి చెందిన రవి, లక్ష్మీజ్యోతి (39) దంపతుల కుమారుడు భరత్ పదో తరగతి పరీక్షల్లో రెండు సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాడు. మనస్తాపం చెందిన తల్లి క్షణికావేశంలో ఇంట్లోనే ఉరేసుకుంది. ఆమె భర్త గుర్తించి ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
News April 25, 2025
పంచాయతీరాజ్ పాత్ర కీలకమైంది: కర్నూలు కలెక్టర్

గ్రామీణాభివృద్ధి, స్థానిక పాలనలో పంచాయతీరాజ్ వ్యవస్థ కీలక పాత్ర పోషిస్తోందని జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా పేర్కొన్నారు. గురువారం కర్నూలు జిల్లా ప్రజా పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా 11వ షెడ్యూల్లో 243 ఆర్టికల్ ద్వారా పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందిస్తూ చట్టం చేశారన్నారు.