News March 30, 2025
శ్రీశైల ఆలయ క్యూలైన్లను పరిశీలించిన నంద్యాల ఎస్పీ

ఉగాది మహోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో బందోబస్తు ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఆదివారం పరిశీలించారు. ఆలయ పరిసరాలు, భక్తుల కంపార్ట్మెంట్ లు, క్యూలైన్లు, లడ్డు కౌంటర్ తదితరాలను పరిశీలించారు. విధులలో సిబ్బంది నిరంతరం అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా అనుకోని ఘటన జరిగితే వెంటనే అధికారులకు సమాచారం అందించాలని సిబ్బందిని ఆదేశించారు. డీఎస్పీ రామాంజి నాయక్, సీఐ ప్రసాదరావు ఉన్నారు.
Similar News
News November 6, 2025
లోక్ అదాలత్లో కేసులు పరిష్కరించాలి: ఎస్పీ శ్రీనివాసరావు

రాజీ పడదగ్గ కేసులు లోక్ అదాలత్లో పరిష్కరించేందుకు కృషి చేయాలని ఎస్పీ శ్రీనివాసరావు సంబంధిత పోలీస్ అధికారులకు సూచించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. స్టేషన్ల వారీగా పెండింగ్ కేసుల గురించి అడిగి తెలుసుకున్నారు. కేసుల పరిష్కారానికై ఈనెల 15న నిర్వహించే ప్రత్యేక లోక్ అదాలత్ను కక్షిదారులు సద్వినియోగం చేసుకునేలా అవగాహన కల్పించాలన్నారు. అడిషనల్ SP శంకర్ పాల్గొన్నారు.
News November 6, 2025
మేడారం జాతరలో 30 వైద్య శిబిరాలు: డీఎంహెచ్వో

జనవరిలో జరిగే మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతరలో 30 ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ములుగు డీఎంహెచ్వో డాక్టర్ గోపాలరావు తెలిపారు. ఉప వైద్యాధికారి, ప్రోగ్రాం ఆఫీసర్లతో కలిసి మేడారంలో పర్యటించారు. శిబిరాల ఏర్పాటుకు అనుకూలమైన స్థలాలను పరిశీలించారు. వైద్య సేవలకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని సిబ్బందిని నియమించుకుంటామన్నారు. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తామని తెలిపారు.
News November 6, 2025
‘తొలిప్రేమ’ ఓ ట్రైనింగ్ సెషన్: అధ్యయనం

ఫస్ట్ లవ్ కొందరికి మధుర కావ్యం. మరికొందరికి తీరని వ్యథ. ఏదేమైనా దీనికి ముగింపు ఉండదని, ఇది జీవిత పాఠాలను నేర్పించడానికేనని ఓ అధ్యయనంలో తేలింది. మొదటి ప్రేమ గమ్యం కాదని, ఇది కేవలం భావోద్వేగాలు, అంచనాలు & హార్ట్ బ్రేకింగ్ అనుభవాన్ని పరిచయం చేసేదని నిపుణులు పేర్కొన్నారు. దీనిని ‘ట్రైనింగ్ సెషన్’గా వారు అభివర్ణించారు. ఈ అనుభవంతోనే భవిష్యత్తులో వచ్చే సంబంధాలకు సిద్ధమవుతారని అధ్యయనం చెబుతోంది.


