News January 27, 2025
శ్రీశైల క్షేత్రాభివృద్ధికి మరిన్ని ప్రతిపాదనలు సిద్ధం!

శ్రీశైలాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు దేవస్థానం అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. రూ.35కోట్లతో ఏడు మెగా వాట్ల సోలార్ పవర్ ప్లాంట్ నిర్మించాలని, రూ.6.2కోట్లతో తాగునీటి ట్యాంకులు, రూ.99 లక్షలతో అమ్మవారి ఆలయ సాలుమండపం పునర్నిర్మాణం, రూ.86 లక్షలతో పంచమఠాల చుట్టూ కంచ నిర్మాణం, రూ.70లక్షలతో అలంకారం మండపం, రూ.60లక్షలతో ఆగమ పాఠశాల అభివృద్ధికి చర్యలు చేపట్టనున్నట్లు ఈవో శ్రీనివాసరావు వెల్లడించారు.
Similar News
News February 8, 2025
TODAY HEADLINES

* రాష్ట్రంలో BCల జనాభా పెరిగింది: రేవంత్
* విజన్-2047కు సహకరించండి: నీతిఆయోగ్‌తో చంద్రబాబు
* ఒంగోలులో ముగిసిన RGV విచారణ
* విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్
* కుంభమేళాలో సన్యాసినిగా మారిన మరో నటి
* ఒక్క వ్యక్తికే రతన్ టాటా ఆస్తిలో ₹500కోట్లు!
* జగన్‌పై షర్మిల సంచలన వ్యాఖ్యలు
* వడ్డీరేట్లు తగ్గించిన RBI
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికలు.. ఈసీ కీలక ఆదేశాలు
News February 8, 2025
7 గంటల పాటు ప్రభావతిని ప్రశ్నించిన SP

AP: డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుపై గతంలో జరిగిన కస్టోడియల్ టార్చర్ కేసులో డాక్టర్ ప్రభావతి విచారణ ముగిసింది. ఆమెను ఒంగోలు ఎస్పీ కార్యాలయంలో 7 గంటల పాటు ఎస్పీ దామోదర్ ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభావతి A5గా ఉన్న విషయం తెలిసిందే. ఆ సమయంలో గుంటూరు జీజీహెచ్ సూపరింటెండెంట్‌గా ఉన్న ఆమె తప్పుడు నివేదికలు ఇచ్చారని ఆరోపణలున్నాయి.
News February 8, 2025
MBNR: మన్యంకొండ గుట్టపైకి ఉత్సాహమూర్తి పల్లకి సేవ.!

శ్రీమన్యంకొండ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి కోట కదిర గ్రామంలోని అళహరి వంశీయుల ఇంటి నుంచి స్వామివారి ఉత్సవ మూర్తి ఊరేగింపు వైభవంగా ప్రారంభమైంది. మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ స్వామి వారిని కోటకదిర గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పల్లకి సేవలో పాల్గొన్నారు. రాత్రి స్వామివారి తిరుచ్చి సేవా నిర్వహిస్తారు. ఆలయ ఛైర్మన్ అళహరి మధుసూదన్ కుమార్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు.