News February 8, 2025
శ్రీశైల జలాశయం నుంచి 6,249 క్యూసెక్కుల నీరు విడుదల

శ్రీశైల జలాశయం బ్యాక్ వాటర్ నుంచి గడిచిన 24 గంటల వ్యవధిలో 6,249 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. హెచ్ఎన్ఎస్ఎస్‌కు 1,560 క్యూసెక్కులు, మహాత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 2 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఆవిరి రూపంలో 272 c/s లాస్ అయింది. ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం 852 అడుగులుగా నీటి నిల్వ సామర్థ్యం 84.4800 టీఎంసీలుగా నమోదైంది.
Similar News
News March 6, 2026
హనుమకొండలో పేలిన సిలిండర్.. రేకుల ఇల్లు ధ్వంసం

హనుమకొండ జేపి నగర్ లో గ్యాస్ సిలిండర్ పేలిన ఘటనలో రేకుల షెడ్డు ఇల్లు పూర్తిగా కాలిపోయింది. హంటర్ రోడ్డు లోని వనవిజ్ఞాన్ సమీపంలో ఉన్న జేపీ నగర్‌లో నివాసం ఉంటున్న సరోజినీ శుక్రవారం ఉదయం గ్యాస్ వెలిగించగానే మంటలు రావడంతో ఇంట్లోంచి బయటకు పరిగెత్తగా మంటలు అంటుకొని సిలిండర్ పేలింది. ఈ ఘటనలో రూ.లక్ష నగదు, తులం బంగారం దగ్ధమయ్యాయి.
News March 6, 2026
సూర్యాపేట: టెన్త్ విద్యార్థులకు కలెక్టర్ నజరానా

పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు కలెక్టర్ తన సొంత ఖర్చులతో పరీక్షా కిట్లు అందించనున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, జెడ్పీ, కేజీబీవీ, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న అర్హులైన విద్యార్థులందరికీ వీటిని పంపిణీ చేయనున్నట్లు డీఈఓ అశోక్ కుమార్ తెలిపారు. విద్యార్థులు ఒత్తిడి లేకుండా పరీక్షలు రాయాలనే ఉద్దేశంతో కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు.
News March 6, 2026
అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలి: మంత్రి

ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉండాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పేర్కొన్నారు. 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాన్ని ఒక ఛాలెంజ్‌గా తీసుకోవాలని సూచించారు. వేసవి ప్రారంభమవుతున్న నేపథ్యంలో నీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపట్టాలని, అధికారులు ముందస్తుగా తాగునీటి సమస్యపై దృష్టి సారించాలని ఆదేశించారు.


