News February 20, 2025
శ్రీశైల బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ

ద్వాదశ జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీశైలం మహా క్షేత్రంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను నంద్యాల జిల్లా ఇన్చార్జి ఎస్పీ విక్రాంత్ పాటిల్ పర్యవేక్షించారు. ఉత్సవాల నిర్వహణ గురించి దేవస్థానం అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించి సీసీ కెమెరాల పనితీరు గురించి అరా తీశారు. ఈయన వెంట నంద్యాల అడిషనల్ ఎస్పీ యుగంధర్ ఉన్నారు.
Similar News
News March 17, 2025
BHPL: ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలి: కలెక్టర్

ప్రజావాణి దరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో జరిగిన ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించి వాటిని ఆయా శాఖల అధికారులకు ఎండార్స్మెంట్ చేసినట్లు తెలిపారు. పరిష్కరించబడిన ఫిర్యాదులపై వచ్చేవారం సమగ్ర నివేదిక అందించాలని స్పష్టం చేశారు. ప్రజావాణికి గైర్హాజరైన అధికారులకు షోకాజ్ నోటీసులు జారీచేయాలని ఆదేశించారు.
News March 17, 2025
మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి: KTR

TG: జర్నలిస్టులను రేవంత్ ప్రభుత్వం అక్రమ కేసులతో వేధిస్తోందని KTR అన్నారు. CMను విమర్శిస్తూ వీడియోలను పోస్ట్ చేసి జైలుపాలైన మహిళా జర్నలిస్టులు రేవతి, తన్వి యాదవ్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘రేవతి, తన్వికి జరిగిందే రేపు మిగతా జర్నలిస్టులకూ జరగొచ్చు. మీడియా గొంతు విప్పి రేవంత్ అక్రమాలపై మాట్లాడాలి’ అని పేర్కొన్నారు. కాగా రేవతి, తన్వికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
News March 17, 2025
వికారాబాద్‌లో NCCని ఏర్పాటు చేయండి: ఎంపీ

వికారాబాద్‌లో NCC యూనిట్‌ను ఏర్పాటు చేయాలని కేంద్ర రక్షణ శాఖ సహాయ మంత్రి సంజయ్ సేత్‌కు చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. మారుమూల ప్రాంతమైన తాండూరు, వికారాబాద్, పరిగి, కొడంగల్, చేవెళ్ల నియోజకవర్గ విద్యార్థిని, విద్యార్థులకు NCC యూనిట్‌ను వికారాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల ఎంతో ఉపయోగంగా ఉంటుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కల్పనలో కూడా రిజర్వేషన్ పొందే అవకాశం ఉంటుందన్నారు.