News February 25, 2025
శ్రీశైల మల్లన్న సన్నిధికి చేరిన అమరచింత పట్టు వస్త్రాలు

మహాశివరాత్రి పురస్కరించుకొని అమరచింత పద్మశాలీలు శ్రీశైల మల్లన్న సన్నిధిలో పది రోజులపాటు నియమ నిష్టలతో స్వామికి పట్టు వస్త్రాలు నేశారు. పది రోజులపాటు నియమ నిష్ఠలతో నేసిన ఈ పట్టు వస్త్రాలను అమరచింత మహంకాళి శ్రీనివాసులు కవితా రాణి దంపతులు తలపై పట్టు వస్త్రాలను పెట్టుకుని శ్రీశైల మల్లన్నకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో మహంకాళి సత్యనారాయణ ఎల్లప్ప కడుదాస్ సిద్ధమ్మ పాల్గొన్నారు.
Similar News
News December 16, 2025
పంచాయతీ పోలింగ్కు పటిష్ఠ భద్రత: ఎస్పీ రోహిత్ రాజు

భద్రాద్రి: మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. 1288 పోలింగ్ కేంద్రాల్లో 1500 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు.
News December 16, 2025
రంగరాయ వైద్య కళాశాల హాస్టల్ నిర్మాణాలకు నిధులు ఇవ్వాలి: ఎంపీ ఉదయ్

రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రఖ్యాతి గాంచిన రంగరాయ ప్రభుత్వ వైద్య కళాశాలలో హాస్టల్ నిర్మాణాలకు నిధులు కేటాయించాలని కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ కేంద్రాన్ని కోరారు. మంగళవారం పార్లమెంటులో ఆయన మాట్లాడారు. హాస్టల్ భవనాల నిర్మాణాలు అసంపూర్తిగా నిలిచిపోయాయని గుర్తు చేశారు. పీజీ లేడీస్ హాస్టల్ పనులు 35%, మెన్స్ హాస్టల్ పనులు కేవలం 15% మాత్రమే పూర్తయ్యాయని, వెంటనే నిధులు విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు.
News December 16, 2025
సిరిసిల్ల: ‘కుష్ఠు వ్యాధి నిర్మూలనకు కృషి చేయాలి’

కుష్ఠు వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ రజిత పేర్కొన్నారు. మంగళవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో జాతీయ కుష్ఠువ్యాధి నిర్మూలన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో డాక్టర్ రజిత మాట్లాడుతూ.. ఈనెల 18 నుంచి జిల్లాలో ఇంటింటా కుష్ఠు వ్యాధి గుర్తింపు నిర్వహిస్తామన్నారు.


