News March 28, 2025

శ్రీశైల మహా క్షేత్రంలో పుష్పాలతో అలంకరణ

image

శ్రీశైల మహా క్షేత్రంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా శుక్రవారం ధ్వజస్తంభం, ఆలయ ప్రాంగణంలో వివిధ పుష్పాలతో అలంకరణ ఘనంగా చేశారు. ఇప్పటికే కర్ణాటక రాష్ట్ర భక్తులు భారీ ఎత్తున శ్రీశైల మల్లికార్జున స్వామిని దర్శించుకుంటున్నారు. ఆలయ అధికారులు భక్తుల రద్దీ సందర్భంగా వారికి అన్ని ఏర్పాట్లు చేశామని తెలిపారు.

Similar News

News October 25, 2025

పటాన్‌చెరు: బీరంగూడ శంభుని కుంట చెరువులో మృతదేహం

image

బీరంగూడ శంభుని కుంట చెరువులో ఓ వ్యక్తి మృతదేహం స్థానికంగా కలకలం రేపింది. అమీన్‌పూర్ మున్సిపాలిటీలోని మంజీరా నగర్ కాలనీ చెందిన తన్నీరు శ్రీను(49) భార్యతో గొడవపడి ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో అతడి కొడుకు వాసు పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుక్రవారం చెరువులో ఓ వ్యక్తి మృతదేహం తేలుతూ కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు.

News October 25, 2025

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్ ఇవే

image

★ఇంటి పన్నుల వసూళ్లపై దృష్టి సారించండి: అచ్చెన్న
★గార: నవంబర్ 2న కూర్మనాధుని తెప్పోత్సవం
★బూర్జ: రైతులు అనుమతి లేకుండా నిర్వహిస్తున్న డ్రోన్ సర్వేపై నిరసన
★హరిపురం PHCని తనిఖీ చేసిన ఎమ్మెల్యే శిరీష
★త్వరలో సీబీఎస్ఈ పాఠశాల ఏర్పాటు: శ్రీకాకుళం ఎమ్మెల్యే
★2029 నాటికి ప్రతీ ఇంటికీ ఒక ఉద్యోగం: పాతపట్నం ఎమ్మెల్యే
★ఆమదాలవలస: 20 కోట్లతో కన్నతల్లికి గుడి

News October 25, 2025

పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

image

TG: రాష్ట్రంలో రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం అంచనా వేసింది. రేపు ఉ.8.30గంటల లోపు పలు జిల్లాల్లో వర్షాలు పడతాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భూపాలపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల్ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్ ఉన్నట్లు పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలకు అవకాశమున్నట్లు చెప్పింది.