News October 20, 2024
శ్రీసత్యసాయి జిల్లాలో కాల్పుల కలకలం
శ్రీసత్యసాయి జిల్లాలో ఆదివారం ఉదయం కాల్పులు కలకలం రేపాయి. నలుగురు వ్యక్తులు రెండు బైకులపై బత్తలపల్లి మండలం రామాపురంలోకి ప్రవేశించారు. ఈక్రమంలో వారి వెనుకే రెండు కార్లలో వచ్చిన వ్యక్తులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. వాళ్లు పక్కకు తప్పుకోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. కాల్పులు చేసింది పోలీసులని.. ఆ నలుగురు దొంగలని సమాచారం. దీనిపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 7, 2024
విషాదం.. తండ్రీకూతురి మృతి
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పీఈటీగా పనిచేస్తున్న రమేశ్, ఆయన కూతురు భవిత నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డారు. వారిని అనంతపురానికి తరలించి చికిత్స అందిస్తుండగా తండ్రీకూతురు మృతి చెందారు. 10వ తరగతి చదువుతున్న భవిత స్టేట్ లెవెల్ హోకీ పోటీలకు హాజరై తిరిగి వస్తుండగా గుట్టూరు వద్ద వారు ప్రమాదానికి గురయ్యారు. తండ్రీకూతురి మృతి ఆ కుటుంబంలో విషాదం నింపింది.
News November 7, 2024
అనంతపురం జిల్లా పోలీసుల ఉక్కుపాదం
అనంతపురం జిల్లాలో నెల రోజులుగా అసాంఘిక కార్యకలాపాలపై పోలీసులు ఉక్కుపాదం మోపినట్లు జిల్లా ఎస్పీ జగదీశ్ పేర్కొన్నారు. రోడ్డు భద్రతానిబంధనల ఉల్లంఘనలపై 12,546 కేసులు నమోదు చేసి రూ.28,30 లక్షలు జరిమానా విధించారన్నారు. మట్కాపై 82 కేసుల్లో 138 మందిని అరెస్టు చేసి రూ.21,94 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. పేకాట స్థావరాలపై దాడుల్లో 118 కేసుల్లో 344 మందిని అరెస్ట్ చేసి రూ.10.33 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు.
News November 7, 2024
ఇన్సూరెన్స్ పథకాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్
శ్రీ సత్యసాయి జిల్లాలో రబీ సీజన్‌కు సంబంధించి ఉద్యాన పంటల పరంగా టమోటా పంటను పంటల బీమా పథకంలో గుర్తించడం జరిగిందని జిల్లా కలెక్టర్ టీఎస్ చేతన్ పేర్కొన్నారు. జిల్లాలో టమోటా పంటను బీమా చేసే సదుపాయం IFFCO-TOKIO అనే కంపెనీకి ఇవ్వడం జరిగిందని, ఒక ఎకరాకి కంపెనీ వారు రూ.32,000 వరకు పంటను బీమా చేస్తారన్నారు. దీనికి రైతు 10శాతం బీమా ప్రీమియం చెల్లించాలన్నారు.