News February 19, 2025

శ్రీసత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

image

✒ TDPలోకి అమరాపురం ZPTC చేరిక
✒ అధికారులపై MLA సింధూర అసహనం
✒ పుట్టపర్తి చేరుకున్న రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక కార్యదర్శి
✒ శ్రీసత్యసాయి జిల్లా కలెక్టర్ కీలక ఆదేశం
✒ రూ.39కోట్లతో అభివృద్ధి పనులు: దినకర్
✒ ధర్మవరం: పట్టాలపై యువకుడి డెడ్ బాడీ
✒ నల్లమాడ MRO ఆఫీసులో తనిఖీలు
✒ కణేకల్లు మండలంలో యువకుడి ఆత్మహత్య

Similar News

News January 7, 2026

మున్సిపల్‌ ఎన్నికలకు సర్వం సిద్ధం: కలెక్టర్

image

నల్లగొండలోని ఏడు మున్సిపాలిటీల్లో ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధం చేసినట్లు కలెక్టర్ బి.చంద్రశేఖర్ వెల్లడించారు. రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన పాల్గొన్నారు. ఓటరు జాబితా సవరణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, సిబ్బంది శిక్షణ పూర్తయిందని వివరించారు. సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయాలని, ఎన్నికల కోడ్‌ను కఠినంగా అమలు చేస్తామని చెప్పారు.

News January 7, 2026

భూపాలపల్లి జిల్లాలో 12 మంది గుర్తింపు: పీఎంఓ

image

జాతీయ ఆరోగ్య మిషన్ ఆధ్వర్యంలో కుష్టు వ్యాధిగ్రస్తులతోపాటు వ్యాధి లక్షణాలు కలిగిన వారి వివరాలను తెలుసుకోవాలని గతనెల 18 నుంచి 31 తేదీ వరకు ఎల్సీడీసీ సర్వే చేశారు. భూపాలపల్లి జిల్లాలో సర్వేలో అనుమానితులుగా 232 మందిని ప్రాథమికంగా గుర్తించారు. 12 మందిని లెప్రసీ కేసులు నమోదైనట్లు, అనుమానిత లక్షణాల గల వ్యక్తులకు రెండోసారి స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా పీఎమ్ఓ మల్లయ్య తెలిపారు.

News January 7, 2026

మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

image

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.