News February 25, 2025

శ్రీసత్యసాయి జిల్లా TODAY TOP NEWS

image

➢ వైసీపీ నుంచి అనంతపురం జిల్లా నేత బహిష్కరణ
➢ అనంతపురంలో ఐదుగురికి జీవిత ఖైదు
➢ తాడిపత్రిలో సినీ నటి మాధవీలతపై కేసు నమోదు
➢ లేపాక్షి మండలంలో యువకుడు ఆత్మహత్య
➢ హిందూపురం మాజీ ఎమ్మెల్యే సతీమణి మృతి
➢ చిలకం మధుసూదన్ రెడ్డికి కీలక బాధ్యతలు
➢ లేపాక్షిలో శివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
➢ ధర్మవరంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

Similar News

News October 26, 2025

పాతపట్నం: కూతురిపై తండ్రి అఘాయిత్యం.. అబార్షన్ చేయడంతో మృతి

image

పాతపట్నం మండలం సరాళి గ్రామానికి చెందిన పోలాకి అప్పారావు హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ వద్ద వాచ్మెన్‌గా పనిచేస్తున్నాడు. 11 ఏళ్ళ కూతురిపై అఘాయిత్యం చేయడంతో గర్భవతి అయింది. అక్కడ ఉన్నవారికి తెలియకుండా శ్రీకాకుళం తీసుకొచ్చి అబార్షన్ చేయించగా ఆరోగ్యం వికటించడంతో విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. అక్కడ ఆమె మృతి చెందింది. అక్కడి వైద్యుల సమాచారం మేరకు పాతపట్నం ఎస్సై మధుసూదన రావు శనివారం కేసు నమోదు చేశారు.

News October 26, 2025

మహబూబ్‌నగర్: డిగ్రీ తొలి సెమిస్టర్ పరీక్ష ఫీజు గడువు విడుదల

image

పాలమూరు యూనివర్సిటీ పరిధిలోని డిగ్రీ మొదటి సెమిస్టర్ (రెగ్యులర్) పరీక్ష ఫీజు గడువును అధికారులు విడుదల చేశారు. విద్యార్థులు ఈ నెల 31వ తేదీలోగా తమ కళాశాలల్లో ఫీజు చెల్లించాలని సూచించారు. రూ.300 జరిమానాతో నవంబర్ 6వ తేదీ వరకు ఫీజు చెల్లించేందుకు అవకాశం ఉంటుందని యూనివర్సిటీ వర్గాలు తెలిపాయి.

News October 26, 2025

పుట్టపర్తి సత్యసాయి బాబా సూక్తులు

image

★ మానవుడు ప్రతి విషయంలోనూ పరిమితిని పాటించాలి. పరిమితి లేకుండా, క్రమశిక్షణ లేకుండా ప్రవర్తిస్తే అనేక పొరపాట్లు జరిగే అవకాశం ఉంది
★ సూర్యునివలే ప్రతి మానవుడు నిరహంకారిగా తయారుకావాలి
★ శ్రమించి పనిచేసే వారికి సర్వసంపదలు చేకూరుతాయి
★ చక్కెరలో నీటిని కలిపినప్పుడు పానకం అవుతుంది, దైవనామ స్మరణతో ప్రేమను కూర్చినప్పుడు అది అమృతం అవుతుంది.