News March 21, 2025
శ్రీసత్యసాయి: పది పరీక్షకు 111 మంది విద్యార్థుల గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో శుక్రవారం జరిగిన పదో తరగతి పరీక్షలకు 111 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాశాఖ అధికారి కిష్టప్ప శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 104 కేంద్రాలలో శుక్రవారం జరిగిన ఇంగ్లీష్ పరీక్షకు రెగ్యులర్ విద్యార్థులు 104 మంది, ప్రైవేట్ విద్యార్థులు ఏడు మంది గైర్హాజరు అయినట్లు ఆయన పేర్కొన్నారు.
Similar News
News December 5, 2025
NLG: త్రివిధ దళాలకు సహకారం అవసరం: నల్గొండ కలెక్టర్

దేశ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న త్రివిధ దళాలకు (ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్) ప్రతి ఒక్కరూ బాసటగా నిలవాలని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి స్పష్టం చేశారు. ఈనెల 7న నిర్వహించనున్న సాయుధ దళాల పతాక దినోత్సవం సందర్భంగా సైనిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ఆమె మాట్లాడారు. ప్రాణాలను పణంగా పెట్టి దేశాన్ని రక్షిస్తున్న సైనికులకు మనమంతా సహకరించాల్సిన బాధ్యత ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 5, 2025
ASF: ఫొక్సో కేసులో నిందితుడికి 35ఏళ్ల జైలు శిక్ష

మైనర్ బాలికను అపహరించి అసభ్యంగా ప్రవర్తించిన కేసులో నిందితుడు సాయి చరణ్ రెడ్డికి 35ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.50,000 జరిమానా విధిస్తూ ఆసిఫాబాద్ కోర్టు తీర్పు వెలువరించింది. 2013లో నమోదైన ఈ కేసులో పీపీఈ శ్రీనివాస్, దర్యాప్తు అధికారుల వాదనలు ఆధారంగా శిక్ష ఖరారైంది. బాధితురాలికి న్యాయం జరిగేలా పనిచేసిన అధికారులను ఎస్పీ నితికా పంత్ అభినందించారు.
News December 5, 2025
మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేం: హైకోర్టు

బాబ్రీ మసీదును పోలిన మసీదు నిర్మాణ విషయంలో జోక్యం చేసుకోలేమని కలకత్తా హైకోర్టు స్పష్టం చేసింది. TMC నుంచి సస్పెండైన MLA హుమాయున్ ప.బెంగాల్ ముర్షిదాబాద్(D) బెల్దంగాలో మసీదు నిర్మించాలని ప్రతిపాదించారు. అయితే అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చిన DEC 6నే శంకుస్థాపనకు ముహూర్తం పెట్టుకున్నారని, స్టే ఇవ్వాలని పిల్ దాఖలైంది. దీనిపై విచారించిన తాత్కాలిక చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని డివిజన్ బెంచ్ తిరస్కరించింది.


