News March 17, 2025
శ్రీసత్యసాయి: పదో తరగతి పరీక్షలకు 210 మంది విద్యార్థులు గైర్హాజరు

శ్రీసత్యసాయి జిల్లాలో జరిగిన పదో తరగతి పరీక్షలలో మొదటి రోజు పరీక్షలో 210 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యాధికారి కృష్ణయ్య పేర్కొన్నారు. జిల్లాలోని 104 కేంద్రాలలో జరిగిన పరీక్షలకు 21,393 మంది విద్యార్థులకు గాను 21,183 మంది విద్యార్థులు హాజరయ్యారన్నారు. పెనుకొండ డివిజన్‌లో 129 మంది, ధర్మవరం డివిజన్‌లో 81 మంది గైర్హాజరు అయ్యారన్నారు.
Similar News
News March 18, 2025
మహబూబాబాద్: నిలిచిన పలు రైళ్లు..!

సాంకేతిక సమస్య తలెత్తి మహబూబాబాద్ జిల్లా గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్ శివారులో ఓ గూడ్స్ రైలు నిలిచిపోయింది. దీంతో కాజీపేట వైపు వెళ్లే పలు రైళ్లు ఆలస్యంగా వెళ్లాయి. గుండ్రతిమడుగు వద్ద తమిళనాడు ఎక్స్‌ప్రెస్, గార్ల రైల్వే స్టేషన్‌లో ఏపీ ఎక్స్‌ప్రెస్, డోర్నకల్ రైల్వే స్టేషన్‌లో కాకతీయ ప్యాసింజర్ నిలిచిపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు.
News March 18, 2025
పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు ఇలా..!

పెద్దపల్లి జిల్లాలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. గడిచిన 24 గంటల్లో అత్యధికంగా ముత్తారం 40.1℃ నమోదు కాగా మంథని 40.1, రామగిరి 40.0, అంతర్గం 40.0, కాల్వ శ్రీరాంపూర్ 39.8, రామగుండం 39.7, ఓదెల 39.7, పాలకుర్తి 39.6, కమాన్పూర్ 39.3, సుల్తానాబాద్ 38.4, ధర్మారం 38.3, పెద్దపల్లి 36.6, ఎలిగేడు 35.7, జూలపల్లి 35.4℃ గా నమోదయ్యాయి. ఇక 10 దాటితే జిల్లాలో ఎండ తీవ్రత భారీగా పెరుగుతుంది.
News March 18, 2025
కడియం: బాలికతో అసభ్యకర ప్రవర్తన.. పోక్సో కేసు నమోదు

కడియం మండలంలోని ఓ గ్రామానికి చెందిన చిన్న(60) మనవరాలు వరుసయ్యే బాలిక పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పోక్సో కేసు నమోదు చేసినట్లు పోలీసులు వివరించారు. తనతో అసభ్యకరంగా ప్రవర్తించాడని బాధిత బాలిక ఫిర్యాదు చేసిందన్నారు. తండ్రి అనారోగ్యంతో చనిపోగా.. తల్లి వేరే దేశంలో ఉంటోంది. బంధువుల ఇంటి వద్ద ఉంటున్న బాలికపై సదరు వ్యక్తి అసభ్యకరంగా ప్రవర్తించాడన్నారు.