News January 30, 2025

శ్రీసత్యసాయి పాఠశాలల వేసవి సెలవుల షెడ్యూల్ విడుదల

image

ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి పాఠశాలలకు వేసవి సెలవులకు సంబంధించిన షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 25వ తేదీ నుంచి వేసవి సెలవులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. వేసవి సెలవుల అనంతరం జూన్ 17వ తేదీ పాఠశాలలు పున:ప్రారంభం అవుతాయని శ్రీ సత్యసాయి పాఠశాలల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది.

Similar News

News February 24, 2026

పంటల్లో బోరాన్ లోపం – కనిపించే లక్షణాలు

image

బోరాన్ లోపం వల్ల మొక్కలో పెరిగే భాగాలైన వేర్లు, లేత చిగురు, లేత కొమ్మలు, లేత పత్రాలపై ప్రభావం పడుతుంది. ఈ లోపం వల్ల మొక్కల చిగుర్లు వికృతాకారంలో
మారతాయి. ఆకులు చిన్నవిగా ఉండి విచ్చుకోకుండా కుచించుకుపోయి కాండపు కణుపు మీద ఉంటాయి. దీని వల్ల మొక్క కురచగా, గుబురుగా కనిపిస్తుంది. చిగుర్ల నుంచి కొమ్మలు ఏర్పడతాయి. లేత ఆకులు ఈనెల మధ్య భాగాలు పసుపు/తెలుపు చారలుగా మారతాయి. తర్వాత ఆకులు ముడుచుకుపోతాయి.

News February 24, 2026

హనుమకొండ హసన్‌పర్తిలో మర్డర్..!

image

హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం సిద్ధాపురం గ్రామంలో సోమవారం రాత్రి మర్డర్ జరిగింది. గ్రామానికి చెందిన బాల్నే మొగిలి దారుణ హత్యకు గురయ్యాడు. గుర్తుతెలియని వ్యక్తులు రాత్రి కత్తులు, గొడ్డలితో వచ్చి మొగిలిని దారుణంగా పొడిచి చంపినట్లు తెలుస్తోంది. హత్యకుగల కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

News February 24, 2026

అనంతపురంలో పారిశ్రామికాభివృద్ధికి ఏపీఐఐసీ ముందడుగు

image

అనంతపురం జిల్లాలో పరిశ్రమల స్థాపన కోసం మూడు MSME పార్కులను అభివృద్ధి చేసినట్లు ఏపీఐఐసీ జోనల్ మేనేజర్ నాగ కుమార్ తెలిపారు. కూడేరు, తిమ్మసముద్రం, ఉరిచింతల గ్రామాల పరిధిలో 293 పారిశ్రామిక ప్లాట్లు కేటాయింపునకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ఏపీఐఐసీ వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.