News February 3, 2025
శ్రీసత్యసాయి: బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించిన ఎస్పీ
సోమవారం హిందూపురం మున్సిపల్ చైర్‌పర్సన్ ఎన్ని జరగనున్న నేపథ్యంలో శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న బందోబస్తు ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఆదివారం స్థానిక పోలీస్ అధికారులతో కలిసి మున్సిపల్ కార్యాలయ పరిసర ప్రాంతాలను పరిశీలించారు. ఎన్నిక సమయంలో కార్యాలయంలోకి కౌన్సిలర్లను మాత్రమే అనుమతించాలని, ప్రతి ఒక్కరిని డీఎఫ్ఎండీ ద్వారా చెక్ చేసి పంపించాలని అధికారులను ఆమె ఆదిశించారు.
Similar News
News February 3, 2025
విజయవాడ: రైల్వేలో ఉద్యోగం.. ఈరోజే లాస్ట్
SCRలో ఉద్యోగం చేయాలనుకునేవారికి గుడ్‌న్యూస్. స్పోర్ట్స్ కోటా కింద రైల్వే రిక్రూట్‌మెంట్ సెల్ దరఖాస్తులు స్వీకరిస్తోంది. సికింద్రాబాద్ హెడ్ క్వార్టర్స్‌లో 31, సికింద్రాబాద్ డివిజన్‌లో 5, హైదరాబాద్-5, విజయవాడ-5, గుంటూరు-5 నాందేడ్-5, గుంతకల్‌లో 5 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్హత: 10th, ఇంటర్, ITI ఉత్తీర్ణత. వయస్సు: 18 నుంచి 25 మధ్య ఉండాలి. అప్లై చేసేందుకు చివరి తేదీ: ఫిబ్రవరి 3, 2025
News February 3, 2025
ఇవాళ్టి నుంచి ఆర్టిజన్ల పోరుబాట
TG: విద్యుత్ శాఖలో విధులు నిర్వహిస్తున్న ఆర్టిజన్లు(సబ్ స్టేషన్ల నిర్వాహకులు) వెంటనే కన్వర్షన్ చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమానికి సిద్ధమయ్యారు. ఇవాళ్టి నుంచి ఫిబ్రవరి 13 వరకు కన్వర్షన్ డిమాండ్‌ను నెరవేర్చాలని కోరుతూ బస్ యాత్రను మహబూబ్‌నగర్‌లో ప్రారంభించనున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటన తర్వాత ఈ నెల 20వ తేదీన చలో విద్యుత్ సౌధ కార్యక్రమానికి పిలుపునిచ్చారు.
News February 3, 2025
పల్నాడు: పెదనందిపాడులో అత్యాచారం, హత్య
పెదనందిపాడులో దారుణ సంఘటన జరిగింది. 64 ఏళ్ల వృద్ధురాలిపై జైలు నుంచి బెయిల్‌పై వచ్చిన నిందితుడు మంజు అత్యాచారం చేసి హత్య చేశాడు. జరిగిన సంఘటనపై వృద్ధురాలి కుమార్తె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ట్రైని ఎస్పీ దీక్షిత, డీఎస్పీ భానోదయ, సీఐ శ్రీనివాస రావులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. క్లూస్ టీమ్ వేలు ముద్రలను సేకరించింది. కేసు నమోదు చేసి మృతదేహాన్ని గుంటూరు జీజీహెచ్‌కి పోలీసులు తరలించారు.