News January 31, 2025

శ్రీసత్యసాయి: రీ సర్వే సందేహాలు నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు

image

శ్రీ సత్య సాయి జిల్లాలో భూముల రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ అమలవుతున్న 32 గ్రామాలలో రైతులు సందేహాలు నివృత్తి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 9441688647 నంబర్‌ను సంప్రదించాలని సంయుక్త కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News October 16, 2025

కర్నూలు సిద్ధం… వెల్‌కమ్ మోదీ జీ!

image

ప్రధాని మోదీకి కర్నూలు ప్రజలు స్వాగతం పలుకుతున్నారు. కాసేపట్లో ప్రత్యేక విమానంలో బయలుదేరనున్న ఆయన ఉ.10.20కి ఓర్వకల్లుకు చేరుకుంటారు. అనంతరం ఎంఐ-17 హెలికాప్టర్‌లో వెళ్లి శ్రీశైల మల్లన్నను దర్శించుకుంటున్నారు. మ.2.20కి కర్నూలులో జరిగి ‘జీఎస్టీ 2.0’ సభలో పాల్గొని రూ.13,400 కోట్ల విలువైన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. మోదీకి <<18016530>>స్వాగతం<<>> పలుకుతూ కర్నూలులో భారీ ఫ్లెక్సీలు వెలిశాయి.

News October 16, 2025

కృష్ణా: బీరు బాటిళ్ల స్కాన్‌పై మందుబాబుల ఆందోళన.!

image

కల్తీ మద్యాన్ని అరికట్టేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సురక్ష యాప్‌’పై వినియోగదారుల్లో ఆందోళన నెలకొంది. తాజాగా యాప్‌లో బీరు బాటిళ్లను స్కాన్ చేస్తే ‘ఇన్వ్యాలిడ్’ అని చూపించడం గమనార్హం. దీనిపై మద్యం తాగేవారు, దుకాణదారులు కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారు. యాప్‌లో సాంకేతిక లోపం ఉందా లేక ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనేది తెలియాల్సి ఉంది.

News October 16, 2025

విశాఖ: దీపావళి వేళ భద్రత కట్టుదిట్టం

image

దీపావళి పండుగ సమీపిస్తుండటంతో రైళ్లలో క్రాకర్లు తీసుకెళ్లకుండా నిరోధించడానికి వాల్తేర్ డివిజన్ అధికారులు భద్రతా చర్యలను ముమ్మరం చేశారు. ప్రయాణీకులకు సురక్షితమైన ప్రయాణానికి డివిజన్ పరిధిలోని స్టేషన్లు, రైళ్లలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ బృందాలు కఠినమైన నిఘా ఉంచుతూ ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తాయి. ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలను భద్రతా సిబ్బందికి తెలపాలని కోరారు.