News January 31, 2025

శ్రీసత్యసాయి: రీ సర్వే సందేహాలు నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్ ఏర్పాటు

image

శ్రీ సత్య సాయి జిల్లాలో భూముల రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ అమలవుతున్న 32 గ్రామాలలో రైతులు సందేహాలు నివృత్తి కోసం కలెక్టరేట్‌లో హెల్ప్ లైన్ నంబర్ ఏర్పాటు చేసినట్లు జాయింట్ కలెక్టర్ అభిషేక్ కుమార్ పేర్కొన్నారు. సర్వే మీద రైతులకు సందేహాలు, సమస్యలు ఉంటే ఉదయం 10:30 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు 9441688647 నంబర్‌ను సంప్రదించాలని సంయుక్త కలెక్టర్ ఒక ప్రకటనలో తెలిపారు.

Similar News

News February 6, 2025

కుటుంబ కలహాలతో యువకుడి ఆత్మహత్య

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన గంగవరపు శీను(35) కుటుంబ కలహాల నేపథ్యంలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు కారణం భార్య జ్యోతి, అత్తమామలే కారణమని లేఖ రాసి, నా ఇద్దరూ చిన్న పిల్లలు జాగ్రత్త అంటూ చనిపోయినట్లు సమాచారం. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.

News February 6, 2025

ప్రయాగ్‌రాజ్‌లో హరీశ్ రావు దంపతులు

image

TG: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు యూపీలోని ప్రయాగ్‌రాజ్‌కు వెళ్లారు. మహాకుంభమేళా సందర్భంగా తన సతీమణి శ్రీనితతో కలిసి త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించారు. ప్రజల శ్రేయస్సు, శాంతి, సామరస్యం కోసం గంగమ్మను ప్రార్థించినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

News February 6, 2025

GWL: పిల్లల విద్యాభివృద్ధికి కృషి చేయాలి.!

image

గ్రామీణ ప్రాంతాల పిల్లల భద్రత, పోషణ, ఆరోగ్యం, విద్యా భివృద్ధి కోసం నిరంతరం కృషి చేయాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. పోషణ, సాధికారిక ఆరోగ్య శిక్షణ కార్యక్రమం ఐడిఓసి సమావేశ మందిరంలో గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ మహిళలను బలోపేతం చేయడం ద్వారా పిల్లల సమస్యలు సమర్థవంతంగా పరిష్కరించవచ్చన్నారు. బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు అందరూ కృషి చేయాలన్నారు.

error: Content is protected !!