News August 31, 2024
శ్రీసత్యసాయి: సంస్కృతి, వారసత్వంపై రీల్స్ చేస్తే.. లక్ష బహుమతి

శ్రీ సత్య సాయి జిల్లాలోని పర్యాటక ప్రదేశాల సంస్కృతి, వారసత్వాన్ని ప్రతిబింబించే విధంగా వీడియోలు, రీల్స్ చేయాలని జిల్లా పర్యాటకశాఖ అధికారి జయ కుమార్ బాబు తెలిపారు. రీల్స్ చేసిన వారిలో ముగ్గురిని ఎంపిక చేసి వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేస్తామన్నారు. ప్రథమ బహుమతి లక్ష రూపాయలు, ద్వితీయ బహుమతి రూ.50,000, తృతీయ బహుమతి రూ.25000 ఇవ్వడం జరుగుతుందన్నారు. సెప్టెంబర్ 5 లోగా రీల్స్ పంపాలన్నారు.
Similar News
News February 19, 2025
రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

రెవెన్యూ సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ వినోద్ కుమార్ ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి రెవెన్యూ సెక్టార్‌పై జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, ఇతర అధికారులతో కలిసి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టాలని, గడువు ముగిసిన గ్రీవెన్స్ ఎలాంటి పెండింగ్ ఉంచడానికి వీలు లేదన్నారు.
News February 19, 2025
యూట్యూబర్ హత్య.. భూ వివాదమే కారణమా?

గుంతకల్లు మండలంలో యూట్యూబర్ తిరుమల్ రెడ్డి హత్యకు గురైన విషయం తెలిసిందే. రెండ్రోజుల క్రితం అదృశ్యమైన ఆయన కసాపురం హంద్రీనీవా కాలవలో మంగళవారం శవమై తేలారు. పోలీసుల వివరాల మేరకు.. భూ వివాదమే ఆయన హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా ఓ నిర్ణయానికి వచ్చారు. సంగాల గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో భూ వివాదం నడుస్తోందని, మృతుడి భార్య కూడా అతడిపై అనుమానం వ్యక్తం చేయడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు.
News February 19, 2025
కళ్యాణదుర్గం కానిస్టేబుల్‌కు జిల్లా ఎస్పీ అభినందన

ఆంధ్రప్రదేశ్ మాస్టర్ అథ్లెటిక్స్ రాష్ట్ర స్థాయి పోటీల్లో నాలుగు పతకాలు సాధించిన కళ్యాణదుర్గం కానిస్టేబుల్ షఫీని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీశ్ అభినందించారు. పతకాలను ప్రదానం చేయడంతో పాటు కానిస్టేబుల్‌ను సన్మానించారు. కాగా షఫీ 100 మీటర్స్ ఈవెంట్‌లో 3వ స్థానం, 200, 400 మీటర్స్‌లో ప్రథమ స్థానం, 4×100 రిలేలో 2వ స్థానం సాధించారు. మార్చి 4 నుంచి 9 వరకు బెంగుళూరులో జరిగే జాతీయ పోటీలకు అర్హత సాధించారు.