News March 21, 2025
శ్రీసిటీలో మరో కంపెనీ ప్రారంభం

శ్రీసిటీలో మరో కొత్త కంపెనీ ప్రారంభమైంది. ఓజెఐ ఇండియా ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ఓపెన్ చేశారు. కంపెనీ కస్టమర్లు, సరఫరాదారులు, ప్రతినిధుల సమక్షంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఓజీ ఇండియా ప్యాకేజింగ్ సీఈవో యోషియుకి కురహషి రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. 100 మిలియన్ల వార్షిక సామర్థ్యంతో అట్ట పెట్టెలు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తామని తెలిపారు.
Similar News
News October 31, 2025
సిరిసిల్ల: ఈ ‘అక్కాచెల్లెళ్లకు GOLD’ MEDALS..!

సిరిసిల్ల(D) చందుర్తి(M) లింగంపేటకు చెందిన కాదాసు నీరజ, నర్మదా NOV 7న SU స్నాతకోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ చేతులతో బంగారు పతకాలు అందుకోనున్నారు. నిరుపేద వ్యవసాయ కుటుంబంలో పుట్టిన ఈ అక్కాచెల్లెళ్లు అగ్రహారం కాలేజీలో 2020- 22లో MA తెలుగు పూర్తిచేశారు. నర్మద ఆధునిక కవిత్వం, నీరజ జానపద విజ్ఞానం అంశాల్లో అత్యధిక మార్కులు సాధించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివిన వీరిని గ్రామస్థులు అభినందిస్తున్నారు.
News October 31, 2025
పెళ్లి సూట్నూ వదల్లేదు.. ఐడియా అదుర్స్!

కాదేది మార్కెటింగ్‌కు అనర్హం అన్నట్లు వినూత్నంగా ఆలోచించాడో వ్యాపారవేత్త. తన పెళ్లి సూట్‌పై యాడ్స్ డిస్ప్లే చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఫ్రెంచ్ వాసి డాగోబర్ట్ రెనౌఫ్ తన వివాహ ఖర్చులను సమకూర్చుకొనేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొత్తం 26 స్టార్టప్ కంపెనీలు స్పాన్సర్ చేయగా పెళ్లి రోజున ఆ సంస్థల లోగోలు ఉన్న సూట్‌ను ఆయన ధరించారు. ఇది సోషల్ మీడియాలో ‘జీనియస్’ ఐడియాగా ప్రశంసలు అందుకుంటోంది.
News October 31, 2025
HYD: అజహరుద్దీన్ ప్రస్థానం ఇదే!

రాజ్ భవన్లో మంత్రిగా అజహరుద్దీన్ ప్రమాణస్వీకారం చేశారు. భారత్ క్రికెట్ జట్టు సారథిగా వ్యవహరించిన అజహరుద్దీన్ 1963 ఫిబ్రవరి 8న HYDలో జన్మించారు. అబిడ్స్‌లోని ఆల్ సెయింట్స్ హైస్కూల్లో పాఠశాల విద్య, నిజాం కాలేజీలో బీకాం అభ్యసించారు. 2009లో అజహరుద్దీన్ కాంగ్రెస్‌లో చేరి, యూపీలోని మొరాదాబాద్ స్థానం నుంచి ఎంపీగా గెలుపొందారు.


