News March 21, 2025

శ్రీసిటీలో మరో కంపెనీ ప్రారంభం

image

శ్రీసిటీలో మరో కొత్త కంపెనీ ప్రారంభమైంది. ఓజెఐ ఇండియా ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్ నూతన పరిశ్రమను శుక్రవారం ఓపెన్ చేశారు. కంపెనీ కస్టమర్లు, సరఫరాదారులు, ప్రతినిధుల సమక్షంలో శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, ఓజీ ఇండియా ప్యాకేజింగ్ సీఈవో యోషియుకి కురహషి రిబ్బన్ కత్తరించి ప్రారంభించారు. 100 మిలియన్ల వార్షిక సామర్థ్యంతో అట్ట పెట్టెలు, ఇతర ఉపకరణాలు తయారు చేస్తామని తెలిపారు.

Similar News

News April 17, 2025

వారికి గౌరవ వేతనం పెంపు: మంత్రి ఫరూఖ్

image

ఏపీలో ప్రత్యేక మెజిస్ట్రేట్ల గౌరవ వేతనం పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. గౌరవ వేతనం రూ.45,000, రవాణా సౌకర్యాలకు మరో రూ.5వేలు ఇవ్వనున్నట్లు పేర్కొంది. 2019 ఏప్రిల్ 1 నుంచే ఇది వర్తిస్తుందని మంత్రి ఫరూక్ తెలిపారు.

News April 17, 2025

వనపర్తి: ‘ఉపాధ్యాయుల సంక్షేమం PRTU TSతోనే సాధ్యం’

image

ఉపాధ్యాయుల హక్కుల సాధన, సంక్షేమం PRTU TSతోనే సాధ్యమని ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి అన్నారు. గురువారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్‌లో PRTU TS గౌరవ అధ్యక్షుడు శివకుమార్ ఉద్యోగ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. శ్రీపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తక్షణమే PRC ఇప్పించే ఏర్పాటు, 2003 DSC వారికి పాత పెన్షన్‌ను ఇప్పించడం, పెండింగ్‌లో ఉన్న అన్ని రకాల బిల్లుల క్లియరెన్స్ చేస్తామన్నారు.

News April 17, 2025

వనపర్తి: ‘పెండింగ్ వేతనాలు వెంటనే చెల్లించాలి’

image

వేతనాల పెండింగ్, ఉద్యోగ భద్రత లాంటి ప్రధాన సమస్యలపై నిరసనగా ఏప్రిల్ 17న వనపర్తిలో తెలంగాణ ప్రగతిశీల గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో టోకెన్ సమ్మె నిర్వహించారు. పాలిటెక్నిక్ మైదానంలో ప్రారంభమైన ర్యాలీ పాత కలెక్టర్ ఆఫీస్ వద్ద ముగిసింది. TUCI జిల్లా అధ్యక్షుడు పి.అరుణ్ కుమార్ మాట్లాడుతూ.. జీవో 60 ప్రకారం జీతాలు, పెండింగ్ వేతనాల చెల్లింపు, ESI, PF, ఇన్సూరెన్స్ అమలు చేయాలని డిమాండ్ చేశారు.

error: Content is protected !!