News August 19, 2024

శ్రీసిటీలో సీఎం చంద్రబాబుకు స్వాగతం పలికిన ఎమ్మెల్యే ఆదిమూలం

image

సత్యవేడు నియోజకవర్గం శ్రీసిటీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేరుకున్నారు. శ్రీ సిటీలో ఆయన పలు కంపెనీలకు భూమి పూజ, పలు కంపెనీల ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖులు మినహా ఇతరులకు ప్రవేశం కల్పించలేదు. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శ్రీ సిటీలో స్వాగతం పలికారు.

Similar News

News January 4, 2026

ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నేటి టమాటా ధరలు

image

టమాటా ధరలు స్వల్పంగా తగ్గాయి. ఆదివారం ధరలు ఇలా ఉన్నాయి.
☞ పుంగనూరులో మొదటి రకం “10 కిలోల” బాక్స్ ధర గరిష్ఠంగా రూ.367, కనిష్ఠ ధర రూ.234
☞ పలమనేరులో గరిష్ఠ ధర రూ. 450, కనిష్ఠ ధర రూ.370
☞వీకోట గరిష్ఠ ధర రూ.420, కనిష్ఠ ధర రూ. 360
☞ కలికిరి గరిష్ఠ ధర రూ.400, కనిష్ఠ ధర రూ. 370
☞ ములకలచెరువులో గరిష్ఠ ధర రూ.450, కనిష్ఠ ధర రూ. 350 వరకు పలుకుతోంది.

News January 4, 2026

చిత్తూరు: ఉపాధిపై రేపు గ్రామసభలు

image

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ఈనెల 5వ తేదీన గ్రామసభలు నిర్వహించనున్నట్లు డీపీవో సుధాకర రావు తెలిపారు. నిరుపేదలకు ఉపాధి హామీ కల్పించేందుకు ఏర్పాటు చేసిన మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును ఇటీవల కేంద్రం వికసిత్ భారత్ వీబీజీ రామ్ జీగా మార్పు చేసినట్లు తెలిపారు. పథకం మార్పులపై గ్రామసభలు నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వులు చేసిందని చెప్పారు. పథకంపై సభలలో అవగాహన కల్పిస్తామన్నారు.

News January 4, 2026

చిత్తూరు జిల్లాలో నేటి చికెన్ ధరలు

image

చిత్తూరు జిల్లాలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. పలు దుకాణాల్లో బ్రాయిలర్ కోడి కిలో రూ.178 నుంచి రూ.187, మాంసం రూ.258 నుంచి 285 వరకు పలుకుతోంది. స్కిన్ లెస్ రూ.294 నుంచి రూ.310 వరకు విక్రయిస్తున్నారు. మరోవైపు12 కోడిగుడ్ల ధర రూ. 96 ఉంది. మీ ఏరియాలో మాంసం ధరలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.