News June 20, 2024
శ్రీసిటీలో 60 ఉద్యోగాలు
శ్రీ సిటీలోని ALSTOM కంపెనీలో ట్రైనీ ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు APSSDC తిరుపతి జిల్లా అధికారి లోకనాథం పేర్కొన్నారు. డిప్లమా, ఐటిఐ వెల్డర్ పూర్తిచేసి 18-22 సంవత్సరాల్లోపు యువతి, యువకులు అర్హులన్నారు. మొత్తం 60 ఖాళీలు ఉన్నట్లు తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు https://forms.gle/zHku28A3SuT8a24E6 వెబ్ సైట్ లో పేర్లు రిజిస్టర్ చేసుకోవాలన్నారు. దరఖాస్తులకు చివరి తేదీ జూన్ 28.
Similar News
News September 17, 2024
చిత్తూరు: టీడీపీలో చేరిన వైసీపీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ
గంగాధర్ నెల్లూరు మండలం ఎట్టేరి గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగ జాయింట్ సెక్రటరీ హరీశ్ యాదవ్ గంగాధర్ నెల్లూరు ఎమ్మెల్యే డాక్టర్ వీఎం థామస్ సమక్షంలో టీడీపీలో చేరారు. ఆయనకు పార్టీ కండువా కప్పి ఎమ్మెల్యే డాక్టర్ థామస్ సాదరంగా ఆహ్వానించారు. గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో టీడీపీ అభివృద్ధికి కృషి చేస్తానని హరీశ్ యాదవ్ అన్నారు.
News September 16, 2024
ఎర్రావారిపాళెం: ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతం
ప్రకృతి వ్యవసాయ అమలులో మహిళల పాత్ర అద్భుతమని మెక్సికో ప్రతినిధులు ప్రశంసించారు. సోమవారం మండలంలోని ఉదయ మాణిక్యం గ్రామంలో వారు పర్యటించారు. మెక్సికో ప్రభుత్వ ఏరియా డైరెక్టర్ డియాజ్ మరియా నేటివిటీ నేతృత్వంలో మెక్సికో బృంద సభ్యులు పర్యటించారు. ఉదయ మాణిక్యం గ్రామంలో గ్రామ ఐక్య సంఘ ప్రతినిధులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మహిళా ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయ అమలులో తమ పాత్రను వివరించారు.
News September 16, 2024
చిత్తూరు జిల్లాకు రాష్ట్రంలో 8వ స్థానం
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఈ కేవైసీ నమోదు ఆదివారంతో ముగిసిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మురళీకృష్ణ తెలిపారు. ఆయన మాట్లాడుతూ..జిల్లాలో ఇప్పటి వరకు 2,38,611 ఎకరాల్లో ఈ-పంట నమోదు చేసి 98.53 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఇంకా 3,563 ఎకరాల్లో ఈకేవైసీ పెండింగ్ లో ఉందని తెలిపారు. ఈకేవైసీలో చిత్తూరు జిల్లా రాష్ట్రంలో ఎనిమిదో స్థానంలో ఉందని చెప్పారు.