News January 14, 2025

శ్రీహరికోట: ఇస్రో ఛైర్మన్ భాద్యతల స్వీకరణ

image

శ్రీహరికోట ఇస్రో నూతన ఛైర్మన్‌గా వి.నారాయణన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సోమనాథ్ పదవి కాలం ముగియటంతో ఆయన స్థానంలో ఆయన నియమితులయ్యారు. ఈ సందర్భంగా నారాయణన్‌ను టీమ్, సోమనాథ్ అభినందించారు. ఇస్రో అభివృద్ధిలో ఆయన కీలకం కానున్నారు. ఈ నెల14 నుంచి ఛైర్మన్ పదవి కాలం ప్రారంభమవుతుంది.

Similar News

News February 16, 2025

జగన్ 2.O పాలనలో అందరి లెక్కలు తేలుస్తా: కాకాణి

image

జగన్ 2.O ప్రభుత్వం రాగానే అతిగా ప్రవర్తించే వారందరి లెక్కలు తేల్చుతామని మాజీ మంత్రి కాకాణి హెచ్చరించారు. పొదలకూరు(M) బిరుదవోలులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో జగన్ తిరిగి ముఖ్యమంత్రి కావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు ధైర్యంగా ఉండాలని, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని కాకాణి హామీ ఇచ్చారు.

News February 16, 2025

నెల్లూరు: ఇంటర్ విద్యార్థులను ఇబ్బంది పెడితే చర్యలు

image

నెల్లూరు జిల్లాలో ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు శనివారం నుంచి ప్రారంభమైనట్లు ఆర్ఐఓ డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బోర్డు నిబంధనలకు అనుగుణంగా పరీక్షలు నిర్వహించాలని ఎగ్జామినర్ చీఫ్ అడిషనల్ సూపర్డెంట్‌‌ను ఆదేశించారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా విద్యార్థులను ఇబ్బంది పెడితే ఆ కళాశాలపై చర్యలు తప్పవన్నారు.

News February 15, 2025

చంద్రబాబు హామీలు పేపర్లకే పరిమితం: కాకాణి

image

చంద్రబాబు రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేస్తున్నాడని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. శనివారం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. కేవలం జగన్మోహన్ రెడ్డికి పేరు రాకూడదనే ఉద్దేశంతోనే వైసీపీ తీసుకొచ్చిన అనేక సంక్షేమ పథకాలు నీరుగారుస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు హామీలన్నీ పేపర్లకే పరిమితమయ్యాయని ఎద్దేవా చేశారు.

error: Content is protected !!